- Telugu News Photo Gallery Cinema photos Chhaava Movie Postponed Due To Allu Arjun Pushpa 2 Release Telugu Heroes Photos
Pushpa 2 vs Chhava: పుష్పరాజ్ రేంజ్ చూసి బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారా.?
పుష్పరాజ్ మేనియా బాలీవుడ్ మేకర్స్‌ను కూడా భయపెడుతోంది. ఇంకా సీరియస్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకముందే పుష్ప 2ని చూసి నార్త్ మేకర్స్ భయపడుతున్నారు. తొలి భాగం ఘన విజయం సాధించటం సీక్వెల్ రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లానింగ్ చూసి, బన్నీతో పోటికి దిగాలనుకున్న హీరోలు.. పుష్ప 2 మీద పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హైప్ ఉంది. తొలి భాగం నార్త్‌లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద కూడా బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Updated on: Nov 08, 2024 | 9:00 PM

పుష్పరాజ్ మేనియా బాలీవుడ్ మేకర్స్‌ను కూడా భయపెడుతోంది. ఇంకా సీరియస్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకముందే పుష్ప 2ని చూసి నార్త్ మేకర్స్ భయపడుతున్నారు.

తొలి భాగం ఘన విజయం సాధించటం సీక్వెల్ రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లానింగ్ చూసి, బన్నీతో పోటికి దిగాలనుకున్న హీరోలు.. పుష్ప 2 మీద పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హైప్ ఉంది.

తొలి భాగం నార్త్‌లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద కూడా బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు పుష్ప 2 మేకర్స్.

విక్కీ కౌషల్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ ఛావా. ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. కానీ సడన్‌గా పుష్పరాజ్ అదే సీజన్‌లో బరిలో దిగేందుకు రెడీ అవ్వటంతో ఛావా మేకర్స్ పునరాలోచనలో పడ్డారు.

బాలీవుడ్‌లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం..! క్రిస్మస్‌కు బేబీ జాన్ తప్పిస్తే.. అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. దాంతో న్యూ ఇయర్ వరకు పుష్ప దూకుడు ఖాయం.

ఆ తర్వాత ఐదేళ్ళకు 2022లో ట్రిపుల్ ఆర్‌తో రెండోసారి.. 2024లో కల్కితో మూడోసారి.. తాజాగా పుష్ప 2తో నాలుగోసారి తెలుగు సినిమాలకు 1000 కోట్లు వచ్చాయి.

ఛావా టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవటంతో పుష్ప 2తో క్లాష్ ఉండకపోవచ్చన్న టాకే వినిపిస్తొంది. ఈ అప్‌డేట్స్‌తో బన్నీ ఫ్యాన్స్.. 'అది పుష్పరాజ్ రేంజ్' అంటూ సంబరపడిపోతున్నారు.




