- Telugu News Photo Gallery Cinema photos Actress Rukmini Vasanth Stunning Saree PhotoShoot Goes Viral
Rukmini Vasanth: రుక్మిణి అందం అదరహో.. చీరకట్టులో అమ్మాడి ఫోజులు.. గుండెల్లో అలజడే..
ఒకే ఒక్క సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇంకేముంది ఈ ముద్దుగుమ్మకు దక్షిణాదిలో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు సైలెంట్ గా చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. రుక్మిణ్ వసంత్..
Updated on: Nov 08, 2024 | 8:10 PM

కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది రుక్మిణీ వసంత్. ఈ సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది.

ప్రస్తుతం కన్నడతోపాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తుంది. మరోవైపు విభిన్నమైన కతలు వింటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమె నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో విడుదలైంది.

ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటించాడు. రుక్మిణి వసంత్ బెంగళూరుకు చెందిన అమ్మాయి. ఆర్మీ కుటుంబంలో 1996లో అక్టోబర్ 10న జన్మించింది.

ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. దేశం కోసం ఆయన అందించిన సేవలకు గానూ కేంద్రం 2007లో అశోక్ చక్ర ప్రకటించింది. రుక్మిణి తల్లి సుభాషిణి భరతనాట్యం డ్యాన్సర్.

లండన్ లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ 2019లో విడుదలైన బీర్బల్ ట్రైయాలజీ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది హిందీలోకి అడుగుపెట్టింది.




