Kantara – SS.Rajamouli: కాంతార సినిమా సక్సెస్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు.. మూవీ హిట్ కావాలంటే..
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న జక్కన్న తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారీ హిట్ అందుకోవాలంటే సినిమాలు భారీ స్థాయిలో

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ చిత్రానికి ప్రపంచమే ఫిదా అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాకు విదేశీయుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జక్కన్న టేకింగ్ పై హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా.. ఇంటర్నేషనల్ అవార్డ్స్ వేడుకలలో సత్తా చాటుతుంది. చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్క నటీనటులు జక్కన్న దర్శకత్వంలో నటించాలని ఆశపడుతుంటారు. ఇక తమ సినిమాలకు రాజమౌళి చిన్న కామెంట్ ఇచ్చిన సంతోషపడిపోతుంటారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న జక్కన్న తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారీ హిట్ అందుకోవాలంటే సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కించాల్సిన అవసరం లేదని.. కాంతార లాంటి చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాన్ని అందుకుంటాయని అన్నారు.
ఇటీవల ఫిల్మ్ కంపానియన్ తో రాజమౌళి మాట్లాడుతూ.. ” సినిమాలకు కలెక్షన్స్ రాబట్టాలి అంటే వారి సినిమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.. భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి పెద్ద స్థాయి అవసరం లేదు. కాంతార లాంటి చిన్న సినిమా కూడా భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. కంటెంట్ ముఖ్యం.. ప్రచారం కాదు. సినిమా అనేది ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించాలి. ఈ విషయాన్ని చిత్రనిర్మాతలుగా.. దర్శకులుగా మనం ఎలా సినిమాను రూపొందిస్తున్నామనేది నిత్యం తనిఖీ చేయాలి” అని అన్నారు.




కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్ కుమార్ కీలకపాత్రలలో నటించారు.
