AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Varma: తేజా సజ్జా పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ప్రశాంత్ వర్మ ఎమోషనల్ పోస్ట్..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఈ చిత్రానికి ముందు నుంచి మద్దతు తెలుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రయూనిట్‏కు అభినందనలు తెలిపారు.

Prashanth Varma: తేజా సజ్జా పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ప్రశాంత్ వర్మ ఎమోషనల్ పోస్ట్..
Prashanth Varma
Rajitha Chanti
|

Updated on: Apr 13, 2024 | 1:34 PM

Share

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో అలరించిన తేజ సజ్జా.. ఇప్పుడు తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ బేబీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తేజా.. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఈ చిత్రానికి ముందు నుంచి మద్దతు తెలుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రయూనిట్‏కు అభినందనలు తెలిపారు. తాజాగా మరోసారి హనుమాన్ సినిమా గురించి మాట్లాడుతూ తేజా సజ్జాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు చిరు.

ఇటీవల ఆహా ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో రాజీవ్ మసంద్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే తేజా సజ్జాను చూపిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఎన్నాళ్లుగానో ఉన్న తన కలను ఇప్పుడు తేజా నేరవేర్చడన్నారు. చిరు మాట్లాడుతూ.. “అక్కడ కూర్చున్న వ్యక్తి 25 ఏళ్ల క్రితం బాలనటుడిగా నా సినిమాల్లో నటించాడు. చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ పెరిగాడు. నన్ను స్పూర్తిగా తీసుకుని ఎదిగాడు. ఇటీవల హనుమాన్ సినిమాతో దేశప్రజల అభిమానాన్ని గెలుచుకున్నాడు. హనుమాన్ పై సినిమా చేయాలని చాలా కాలంగా అనుకున్నాను. కానీ కుదరలేదు. కానీ అతడు చేశాను. అందుకు నేను పూర్తిగా సంతృప్తి చెందాను. అతను నా ప్రయాణంలో భాగమే ” అంటూ తేజా పై ప్రశంసలు కురిపించారు. చిరు మాట్లాడుతున్న సమయంలో తేజా సంతోషంతో చూపించిన ఎక్స్‏ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

తాజాగా చిరు మాటలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. “హనుమాన్ సినిమాలో యాక్ట్ చేయడం పద్మ విభూషణ్ చిరంజీవి కల అని విని ఎంతో సంతోషంగా అనిపించింది. ఆయన మాటలు నాపై మరింత బాధ్యత పెంచాయి. ఈ క్షణాలను ఎప్పిటకీ గుర్తుపెట్టుకుంటాను. ఆ వీడియో చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు. తేజ అప్పుడు ఏ విదంగా ఫీల్ అవుతున్నాడో ఊహించగలను” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి