AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ‘టైగర్ కా హుకుం’.. జైలర్ సీక్వెల్ రెడీ.. రజినీ రెమ్యునరేషన్ 200కోట్లకు పైనే..!

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా కుమ్మేసింది. జైలర్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. జైలర్ సినిమా భారీ హిట్ అయిన తర్వాత ఈ మూవీ సీక్వెల్ పై చాలా వార్తలు వచ్చాయి.

Rajinikanth: 'టైగర్ కా హుకుం'.. జైలర్ సీక్వెల్ రెడీ.. రజినీ రెమ్యునరేషన్ 200కోట్లకు పైనే..!
Jailer Movie
Rajeev Rayala
|

Updated on: Apr 13, 2024 | 1:05 PM

Share

రజనీకాంత్ ‘జైలర్’ సినిమాతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా సూపర్ స్టార్ నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు జైలర్ సినిమా కిక్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా కుమ్మేసింది. జైలర్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. జైలర్ సినిమా భారీ హిట్ అయిన తర్వాత ఈ మూవీ సీక్వెల్ పై చాలా వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి జైలర్ సీక్వెల్ గురించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం త్వరలోనే జైలర్ 2 సినిమా పట్టాలెక్కనుంది. ‘ జైలర్ 2 ‘ చిత్రాన్ని మడోకా నెల్సన్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో రజనీకాంత్ సోలో హీరోగా కనిపించనున్నారట. ఇది విని అభిమానులు ఖుష్ అవుతున్నారు. రజనీకాంత్ నుంచి  యాక్షన్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. పంచ్ డైలాగ్స్ ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తారు ఫ్యాన్స్. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. దీనికి తోడు శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ గెస్ట్ అప్పియరెన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. విలన్‌గా మలయాళం వినాయకన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి నెల్సన్ సిద్ధమయ్యారు.

‘జైలర్ 2’కి ‘హుకుం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉంది.  నెల్సన్ ఆలోచన నాకు నచ్చింది. ‘జైలర్’ సినిమా క్లైమాక్స్‌లో తప్పు చేసిన కొడుకును హీరో చంపే సన్నివేశం ఉంటుంది. నెల్సన్‌కి ఈ కథను ఖచ్చితంగా కొనసాగించాలనే ఆలోచన వచ్చిందట దర్శకుడికి. ఈ కథకు రజనీకాంత్, సన్ పిక్చర్స్ నుంచి అనుమతి కూడా లభించిందట. కాగా ఈ సినిమాలో శివన్న, మోహన్ లాల్ కూడా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

రజనీకాంత్ నటించిన ‘వెట్టయన్’ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘తలైవర్ 171’  చిత్రంలో నటించనున్నారు. దీని తర్వాత ‘జైలర్ 2’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే జైలర్ 2 సినిమా కోసం రజనీకాంత్ 250 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. రజనీకాంత్‌కి ప్రస్తుతం 73 ఏళ్లు. అయినా కూడా ఆయన యాక్షన్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాగే ‘తలైవర్ 171’ సినిమాలో రజనీకాంత్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, రణవీర్ సింగ్, పార్వతి నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.