Salaar: సలార్ సినిమా సీన్స్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి.. రీ షూట్ చేసేందుకు సిద్ధమైన డైరెక్టర్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. వరుస సినిమాలను పూర్తిచేస్తూనే కొత్త ప్రాజెక్ట్‎లకు

Salaar: సలార్ సినిమా సీన్స్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి.. రీ షూట్ చేసేందుకు సిద్ధమైన డైరెక్టర్..
Salaar
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2021 | 9:46 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. వరుస సినిమాలను పూర్తిచేస్తూనే కొత్త ప్రాజెక్ట్‎లకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ స్పీడ్ మీదున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేశాడు ప్రభాస్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటుంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ వంటి సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో డార్లింగ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డే్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ కే షెడ్యూల్ పూర్తైన వెంటనే సలార్ సినిమా షూటింగ్‏ను మళ్లీ ప్రారంభించాలని భావిస్తున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇంతకు ముందు సీక్వెన్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ షూట్ చేయబోతున్నారని. తాజా సమాచారం ప్రకారం సలార్ ఇంటర్వెల్ సీక్వెన్స్ రీ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సలార్ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ చూపించాలనుకున్నాడట ప్రశాంత్ నీల్. అందుకే ఇంటర్వెల్ సీక్వెన్స్ యాక్షన్ సన్నివేశాలు ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదని.. అందుకే మళ్లీ రీషూట్ చేయాలని భావిస్తున్నారట. ఇక ప్రశాంత్ నీల్ నిర్ణయాన్ని ప్రభాస్ అభిమానులు స్వాగతిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

Also Read: Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన చిరంజీవి.. మెగా డిసెంబర్ అంటూ నెట్టింట్లో చిరు మేనియా..

Shyam Singha Roy: సిరివెన్నెల రాసిన చివరి పాట.. శ్యామ్ సింగరాయ్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..

Upasana & Samantha: ఎంతో విలువైనది..వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయంటూ ఉపాసన ఎమోషనల్.. సమంత రియాక్షన్..

Manasanamha: ఆస్కార్ అవార్డు బరిలో నిలిచిన తెలుగు సినిమా.. కృతజ్ఞతలు తెలిపిన మనసానమః మూవీ టీమ్..