AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Maruthi: ‘మెగాస్టార్‌ను ఎలా చూపించాలో నాకు బాగా తెలుసు’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మారుతి

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు మారుతి(Maruthi). తాజాగా ఆయన తెరకెక్కించిన పక్కా కమర్షియల్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అందాల రాశీఖన్నా హీరోయిన్..

Director Maruthi: 'మెగాస్టార్‌ను ఎలా చూపించాలో నాకు బాగా తెలుసు'.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మారుతి
Maruthi
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2022 | 5:06 PM

Share

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు మారుతి(Maruthi). తాజాగా ఆయన తెరకెక్కించిన పక్కా కమర్షియల్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అందాల రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా వ్యవహరించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారు. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. తాజాగా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ.. ఈ సినిమా కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మారుతి మాట్లాడుతూ.. చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తి నాతో సినిమా చేస్తాను అని చెప్పడం నాకు పెర్సనల్ గా గొప్ప ఎనర్జీ నిచ్చినట్టు అనిపించడమే గాక నా లాంటి డైరెక్టర్ కు గొప్ప ఎంకరేజ్మెంట్. అలాగే తరువాత దర్శకులకు ఆయన వ్యాఖ్యలు ఒక ఇన్స్పిరేషన్. చిరంజీవి గారిని ఎలా చూపించాలో ఒక డైరెక్టర్ గా కాకుండా ఒక ఆడియన్ గా అలోచించి చూపిస్తాను. ఆయన ఏదిచ్చినా చేస్తారు. కానీ నా స్ట్రెంత్ ఏంటి ఆయనను ఎలా చూపిస్తే బాగుంటుంది అనేది నాకు ఒక వ్యూ ఉంటుంది అన్నారు. ఇక పక్కా కమర్షియల్ సినిమాతో గోపీచంద్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా హీరో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు.ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని ఆయన కూడా బాగా నమ్మారు. పక్కా కమర్షియల్ అని ఈ సినిమాకు పేరు పెట్టినప్పుడే ఇందులో కావాల్సిన క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకునే అవకాశం దొరికింది అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..