Ponniyin Selvan: మణిరత్నం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పొన్నియిన్ సెల్వన్ నుంచి క్యారెక్టర్ లుక్స్…
విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ (ponniyin selvan).
విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ (ponniyin selvan). ఈ సినిమాకు ఏస్ డైరెక్టర్ మణి రత్నం దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ హిస్టారికల్ ఎపిక్ మూవీగా తెరకెక్కుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’.. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. పొన్నియిన్ సెల్వన్ నుంచి క్యారెక్టర్ లుక్స్ విడుదల చేశారు మేకర్స్.
ఇందులో విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై మణిరత్నం, అల్లిరాజా సుభాస్కరన్ నిర్మాతగాలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ హిస్టారికల్ ఫిక్షనల్ ఎపిక్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’. భారీ నిర్మాణ విలుువలతో, హై టెక్నికల్ వేల్యూస్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. అందులో మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ సినిమాలో ప్రధాన తారాగణమైన విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేశారు. ఒక్కో లుక్ ఒక్కో తరహాలో డిఫరెంట్‌గా ఆకట్టుకుంటోంది. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత అందిస్తున్న ఈ చిత్రానికి రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Wishing our Producer Allirajah Subaskaran a very happy birthday! The Golden Era comes to the big screens on Sept 30th! ?#PS1 #PS1FirstLooks @LycaProductions #AishwaryaRaiBachchan pic.twitter.com/Gp0ajFlwvi
— Madras Talkies (@MadrasTalkies_) March 2, 2022
Also Read: Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..
Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..
Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..
Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి