AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranga Maarthaanda: ‘రంగమార్తాండ’ గురించి కీలక అప్‌డేట్.. అనుమానాలు పటాపంచలు చేసిన క్రియేటివ్ డైరెక్టర్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి మరో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

Ranga Maarthaanda: 'రంగమార్తాండ' గురించి కీలక అప్‌డేట్.. అనుమానాలు పటాపంచలు చేసిన క్రియేటివ్ డైరెక్టర్
Ranga Marthanda Movie
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2021 | 7:17 PM

Share

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి మరో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత పదేళ్లలో కృష్ణవంశీ నుంచి సూపర్ హిట్ అనే రేంజ్‌ సినిమా ఒక్కటి కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ కోసమే అన్నట్టుగా ఓ సాలిడ్ ఎమోషనల్‌ ఎంటర్టైనర్‌ను రెడీ చేస్తున్నారు కృష్ణవంశీ. మరాఠ సూపర్ హిట్ నటసామ్రాట్‌ను తెలుగు ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే అనౌన్స్‌ అయిన ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ఒక్కటి తప్ప మరో అప్‌డేట్ రాలేదు. కరోనా టైమ్‌లో అయితే రంగమార్తండ గురించి ఎలాంటి న్యూస్ రాకపోవటంతో ఈ సినిమా ఆగిపోయిందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రకాష్ రాజ్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాను త్వరలోనే రీస్టార్ట్ చేస్తామన్నారు.

ఆల్రెడీ షూటింగ్ షురూ చేసేందుకు ఏర్పాట్లు కూడా మొదలెట్టేశారు కృష్ణవంశీ. అయితే అక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రకాష్ రాజ్‌, రమ్యకృష్ణ ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్నారు… ఇప్పుడు వాళ్ల కాంబినేషన్‌లో డేట్స్ అడ్జస్ట్ చేయటమే మెయిన్ టాస్క్‌. దీనికి తోడు బుల్లితెర బిజీ ఆర్టిస్ట్‌ అనసూయ కూడా ఈ సినిమాలో కీ రోల్‌లో నటిస్తున్నారు. సో ఇప్పుడు ఆమె డేట్స్ కూడా అడ్జస్ట్ చేసి ఆగస్టు ఫస్ట్ వీక్‌లోనే షూటింగ్‌ను మొదలు పెడతారట. ఏది ఏమైనా ఈ సినిమాపై చాలా బజ్ ఉంది. మరి  క్రియేటివ్ డైరక్టర్ అభిమానులను ఈసారైనా అలరిస్తారో, లేదో  వేచి చూడాలి.

Also Read: Farhan Akhtar: వాటే ట్రాన్స్‌ఫర్మేషన్.. సినిమా కోసం నీ డెడికేషన్ సూపర్ గురూ !

 రూ.200 ఇవ్వలేదని కన్నతండ్రినే దారుణంగా చంపేశాడు