AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadradri Kothagudem: రూ.200 ఇవ్వలేదని కన్నతండ్రినే దారుణంగా చంపేశాడు

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో రోకలిబండతో బాది...

Bhadradri Kothagudem: రూ.200 ఇవ్వలేదని కన్నతండ్రినే దారుణంగా చంపేశాడు
Son Kills Father
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2021 | 6:06 PM

Share

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో రోకలిబండతో బాది కన్న తండ్రినే హత్య చేశాడు ఆ తనయుడు. జిల్లాకేంద్రంలోని హనుమాన్​ బస్తీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న గోశిక కొమురయ్య(61) ఇటీవలే మెడికల్‌ టెస్టుల్లో అన్‌ఫిట్‌ అయ్యాడు. అతని జాబ్ కుమారుడికి ఇవ్వకుండా యాజమాన్యం అందించిన పరిహారం తీసుకున్నాడు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన కొమురయ్య కుమారుడు శివకుమార్‌… తండ్రిపై కోపం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి.. మద్యం సేవించడానికి 200 రూపాయలు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. డబ్బులు లేవని కొమురయ్య చెప్పడంతో ఆగ్రహంతో శివకుమార్​ తండ్రిపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొమురయ్య స్పాట్‌లోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పరారీలో ఉన్న శివకుమార్‌ కోసం గాలిస్తున్నారు.

సెప్టిక్ ట్యాంకు కోసం తీసిన గుంతలో పడి 6 ఏళ్ల బాలుడు మృతి

 ఇంటి పక్కన సెప్టిక్ ట్యాంకు కోసం తీసిన గుంత… బాలుడి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సిరిపాటి సాయిరాం, పూలమ్మలకు ఆరుగురు సంతానం. తల్లిదండ్రులు ఇద్దరూ… ఇద్దరు పిల్లలను తీసుకొని కూలీపనికి వెళ్లారు. మిగిలిన నలుగురు పిల్లలు ఇంటి వద్దే ఉన్నారు. అందులో భాగంగానే చిన్న కుమారుడు మహంకాళి(6) నిన్న మధ్యాహ్నం ఆడుకునేందుకని బయటకి వెళ్లాడు. సాయంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊరంతా వెతికారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో బాబు తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల ఇంటిపక్కనే సెప్టింక్ ట్యాంకు కోసం ఓ గుంత తీశారు. వర్షం కారణంగా… ఆ గుంతలో నీరు నిండిపోయింది. పోలీసులకు అనుమానం వచ్చి అందులో గాలించగా… మహంకాళి డెడ్‌బాడీ లభ్యమైంది.

Also Read:  ఏపీలోని ఆ ప్రాంత ప్రజలకు అలెర్ట్.. వారం రోజులపాటు కర్ఫ్యూ విధింపు

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపట్నుంచి పెను మార్పులు.. వాలంటీర్లకు కూడా కీలక హెచ్చరిక

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?