AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesah: ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపట్నుంచి పెను మార్పులు.. వాలంటీర్లకు కూడా కీలక హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్థాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపటి నుంచి పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Andhra Pradesah: ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపట్నుంచి పెను మార్పులు.. వాలంటీర్లకు కూడా కీలక హెచ్చరిక
Ap Village Secretariat System
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2021 | 5:02 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్థాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపటి నుంచి పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం… కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులంతా సమయానికి విధులకు హాజరు కావాల్సిందే అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం ఇప్పటి వరకు అవలంభించిన రిజస్టర్ సంతకం విధానానికి స్వస్తి పలికింది. రేపటి నుంచి అన్ని సచివాలయాల్లో బయో మెట్రిక్ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతి ఉద్యోగి ఆఫీసుకు వచ్చి, వెళ్లే సమయాల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ లో నమోదు చేయాల్సిందే. అలాగే ఇకపై ప్రతి ఉద్యోగి కూడా వారి.. వారి సచివాలయం పరిధిలోనే నివశించాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వారు ఎక్కడ ఉండేది… పంచాయతీ అధికారికి తెలియజేయాలని… అలాగే.. సచివాలయ ఉద్యోగి పూర్తి చిరునామా, వివరాలను ఆయా కార్యాలయాల్లో అందరికీ అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించింది.

ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కూడా ఉద్యోగులకు ఆ శాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కూడా ఆయా జిల్లాల వారీగా ఆదేశాలు జారీ చేసింది పంచాయతీ రాజ్ శాఖ. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యంగా ఉన్నా… సకాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించకున్నా కూడా సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రేపటి నుంచి ప్రతి సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ కూడా వారి వారి పరిధిలోని సచివాలయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలని ఆదేశించింది. ఎక్కడైనా సాంకేతిక లోపం వస్తే… వెంటనే సంబంధిత అధికారికి చెప్పాలని ప్రభుత్వం సూచించింది. జులై నెల జీతం బయోమెట్రిక్ తో లింక్ అయి వస్తుందని.. ఎన్నిరోజులు హాజరు ఉంటే అన్ని రోజులకే జీతం వస్తుంది. సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి ఎల్ఎంఎస్ ద్వారా ట్రైనింగ్ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు.  ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం CBAS మార్కులను అనుసంధానం చేస్తామన్నారు. వ్యవస్థ ప్రారంభించి రెండేళ్లు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ పీరియడ్ లోకి రానున్నారు.

Also Read:  భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

క్రేజీ ఫిష్.. కొండలు సైతం ఎక్కగలదు.. మరో షాకింగ్ విషయం ఏంటంటే..?

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా