Andhrapradesh: ఏపీలోని ఆ ప్రాంత ప్రజలకు అలెర్ట్.. వారం రోజులపాటు కర్ఫ్యూ విధింపు

మాయదారి కరోనా వచ్చింది. మానవవాళిని అతలాకుతలం చేసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లు ఎంత డ్యామేజ్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

Andhrapradesh: ఏపీలోని ఆ ప్రాంత ప్రజలకు అలెర్ట్.. వారం రోజులపాటు కర్ఫ్యూ విధింపు
Ap Curfew
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 21, 2021 | 5:49 PM

మాయదారి కరోనా వచ్చింది. మానవవాళిని అతలాకుతలం చేసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లు ఎంత డ్యామేజ్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందరో ఆప్తుల్ని కోల్పోయాం. వ్యాధి బారినపడ్డవారికి ఆక్సిజన్ అందించలేక, పడకలు సర్దుబాటు చేయలేక ప్రభుత్వాలు కూడా విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. సెకండ్ వేవ్ ప్రళయం నుంచి కోలుకోకముందే.. థర్డ్ వేవ్ అతి సమీపంలో ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. ఏపీలో కూడా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తీవ్రత పెరగకుండా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా మూడో దశలోకి కొనసీమను తీసుకెళ్లకుండా ప్రజలు జాగ్రత్తపడాలని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి కోరారు. మొదటి, రెండవ దశల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. మూడవ దశలోకి కొనసీమను తీసుకెళ్లకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.  ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్పారు.  ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మూడవ దశ కోవిడ్ బారిన పడకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

కోనసీమలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పి.గన్నవరం మండలంలో పలుచోట్ల కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. మండలంలో పాజిటివ్ రేట్ అధికంగా ఉన్న నేపథ్యంలో వారం రోజుల పాటు పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇవాల్టి నుండి వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుంది. మిగతా సమయాల్లో కర్ఫ్యూ కొనసాగనుంది.

Also Read:భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

క్రేజీ ఫిష్.. కొండలు సైతం ఎక్కగలదు.. మరో షాకింగ్ విషయం ఏంటంటే..?