AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,527 కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,280 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,527 కేసులు...

AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,527 కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Ap Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 21, 2021 | 5:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,280 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,527 కేసులు వెలుగుచూశాయి. మరో 19 మంది వైరస్‌తో పోరాడలేక ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,46,749 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో తెలిపింది. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,197కి చేరినట్లు వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 2,412 మంది బాధితులు వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,09,613కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,38,38,636 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, నెల్లూరులో జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కడప, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు దిగువన చూడండి

రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జనసమూహాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read:ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపట్నుంచి పెను మార్పులు.. వాలంటీర్లకు కూడా కీలక హెచ్చరిక

స్పేస్ టూరిజం సూపర్ సక్సెస్.. కానీ ఖర్చు ఎంత అవుతుందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!