AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Space Tour: స్పేస్ టూరిజం సూపర్ సక్సెస్.. కానీ ఖర్చు ఎంత అవుతుందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

స్పెస్‌ టూర్‌ వినడానికి హాయిగా ఉంది.. టూరిజం స్పాట్‌ అంటుంటే భలే థ్రిల్లింగ్‌గా ఉంది.. కానీ ఆ టూర్‌ కాస్ట్‌ తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇలా వెళ్లి అలా తిరిగొస్తున్నారు....

Space Tour: స్పేస్ టూరిజం సూపర్ సక్సెస్.. కానీ ఖర్చు ఎంత అవుతుందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్
Space Tourism
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2021 | 5:24 PM

Share

స్పేస్‌ టూర్‌ వినడానికి హాయిగా ఉంది.. టూరిజం స్పాట్‌ అంటుంటే భలే థ్రిల్లింగ్‌గా ఉంది.. కానీ ఆ టూర్‌ కాస్ట్‌ తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇలా వెళ్లి అలా తిరిగొస్తున్నారు. కానీ ఈ గ్యాప్‌లో కోట్ల రూపాయలో గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా బ్లూ ఆరిజన్ స్పేస్‌ ఫ్లైట్ ఎగరడానికి నిమిషానికి ఎన్ని కోట్లు ఖర్చయ్యాయో తెలుసా..? జస్ట్ 60 సెకన్లకి 4,100 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అవును నిజం.. 11 నిమిషాలకు 45100 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అంటే మన రాష్ట్ర బడ్జెట్‌లో సగం ఖర్చన్నమాట. అమెరికాలో అక్కడి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ముగ్గురు వ్యాపార వేత్తలు స్పేస్ టూరిజాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. కానీ మన దేశంలో అది సాధ్యమేనా? అసలు రాకెట్‌ పంపేంత సీన్ ఉందా? మన వ్యాపార దిగ్గజాలు అంబానీ, ఆదానిలు స్పేస్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ అంబానీ, ఆదానిలు స్పేస్ టూరిజాన్ని డెవలప్ చేసినా అందులో ప్రయాణించే వాళ్లుంటారా అన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. నిమిషానికే కోట్ల రూపాయల ఖర్చు అంటే ఆలోచించాల్సిందే. అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టి స్పేస్‌లోకి వెళ్లొస్తారా అన్నది ప్రస్తుతానికి అయితే అనుమానమే.

విజయవంతంగా జెఫ్ బెజోస్​ అంతరిక్ష యాత్ర

ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా పూర్తయిన విషయం తెలిసిందే. బెజోస్​తో పాటు.. మొత్తం నలుగురు సభ్యుల టీమ్ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరుకుంది. నలుగురు సభ్యుల బృందంలో జెఫ్​ బెజోస్​ సోదరుడు మార్క్ బెజోస్, ప్రముఖ మహిళా పైలట్​ వేలీ ఫంక్ (82), ఆలివర్‌ డేమన్‌ (18) ఉన్నారు. బెజోస్ సోదరులు కాకుండా మిగతా ఇద్దరు.. అంతరిక్షయానం చేసిన వారిలో అత్యంత పెద్ద, పిన్న వయస్కులుగా రికార్డు సృష్టించారు.

Also Read:  భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

 ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపట్నుంచి పెను మార్పులు.. వాలంటీర్లకు కూడా కీలక హెచ్చరిక

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు