Enugu: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఏనుగు.. రిలీజ్ ఎప్పుడంటే..

ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో సముద్రఖని, KGF

Enugu: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఏనుగు.. రిలీజ్ ఎప్పుడంటే..
Enugu Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 26, 2022 | 11:21 AM

యంగ్ హీరో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఏనుగు.(Enugu)  ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు కీలకపాత్రలలో నటిస్తోన్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.

చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ…మంచి కంటెంట్ తో వస్తున్న ఈ “ఏనుగు” సినిమా నాకు 16వ సినిమా. ఇందులో ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఇందులో చూయించడం జరిగింది.అలాగే ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీ తో వచ్చి చూసే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.ఇంతకుముందు నేను చేసిన చిత్రాలను ఆదరించి నట్లే ఇప్పుడు మంచి కంటెంట్ తో జులై 1 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ‘ఏనుగు” సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి నెక్స్ట్ సినిమా “ఏనుగు”. హరితో కలసి మేము మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలని ఎంటర్టైన్మెంట్ రూపంలో ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు సినిమా చాలా బాగుందని U/A సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!