AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gunashekar : సినిమాలకు భారీ సెట్స్.. మహేష్ చెప్పిన ఆ మాటలే నన్ను మార్చాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఒక్కడు, అర్జున్, సైనికుడు వంటి సినిమాలతో అలరించారు. ఇటీవల యుఫోరియా సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ రివ్యూ అందుకుంటూ దూసుకుపోతుంది.

Gunashekar : సినిమాలకు భారీ సెట్స్.. మహేష్ చెప్పిన ఆ మాటలే నన్ను మార్చాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
Gunasekhar, Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2026 | 4:42 PM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో సక్సెస్ ఫుల్ దర్శకులలో డైరెక్టర్ గుణశేఖర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం యుఫోరియా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇందులో భూమిక, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగ ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సినిమా కోసం తాను వేసే భారీ సెట్స్ గురించి.. ఆ సమయంలో మహేష్ తనకు ఇచ్చిన సున్నితమైన హెచ్చరిక గురించి బయటపెట్టారు. మహేష్ మాటలు తనను ఎంతో మార్చాయని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, సైనికుడు ఇలా ప్రతి సినిమాకు భారీ సెట్స్ వేశారు గుణశేఖర్. అప్పట్లో ఆయన వేసిన సెట్స్ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. వరుసగా సెట్స్ వేస్తూ సినిమాలు తీయడం తనను దెబ్బ కొట్టిందని అన్నారు. ఈ విషయంలో స్టార్ హీరో మహేష్ బాబు సైతం తనను హెచ్చరించారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

గుణశేఖర్ మాట్లాడుతూ.. “భారీ సెట్స్ వేసి సినిమాలు తీయడం నన్ను దెబ్బ కొట్టింది. సైనికుడు సమయంలో వేయి స్తంభాల గుడి సెట్ వేశాం. అప్పటికే ఆ ట్రాప్ లో నేను పడిపోయాను. ఆ సమయంలో మహేష్ బాబు నన్ను హెచ్చరించారు. సెట్స్ భారీగా వేయడం వల్ల అక్కడే ఎక్కువ వర్క్ చేయాలనే ఉద్దేశం పెరుగుతుంది. దీంతో కథ అటు వైపు తిరుగుతోందని అనిపిస్తుందని మహేష్ చెప్పారు. ఆలోచిస్తే అది నిజమే అనిపించింది. సెట్ వేశాం కాదని అక్కడే ఎక్కువగా షూటింగ్స్ చేశాము. దీంతో కథ లిమిట్ మారిపోయింది. మహేష్ మాటలతో రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి సెట్స్ జోలికి వెళ్లలేదు. చూడాలని ఉంది.. ఒక్కడు సినిమాలకు కథ ప్రకారమే వెళ్లాను. ఆ తర్వాతే సెట్స్ ట్రాప్ లో పడ్డాను.” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

Follow Us
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..