Tollywood : క్లైమాక్స్ చెప్పగానే నవ్వేశారు.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. డైరెక్టర్ కామెంట్స్..
సాధారణంగా ఒక్కో సినిమా క్లైమాక్స్ ఒక్కోలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్లైమాక్స్ మీదనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ తో సినిమా పూర్తి కావడం.. లేదా సంతోష క్షణాలతో ఎండ్ కావడం చేస్తూంటాం. కానీ ఒక సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. అయినా ఆ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎన్నో ప్రేమకథలు సక్సెస్ అయ్యాయి. అలాగే థియేటర్లలో మరెన్నో బ్రేకప్ స్టోరీలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. కానీ ఓ సినిమా క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను గుక్కపెట్టి ఏడ్చేలా చేసింది. తాము ఎంతో ఇష్టపడే హీరో మరణించే సీన్ చూసి ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. అయినప్పటికీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ మూవీ పేరు ప్రియసి రావే. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో డైరెక్టర్ చంద్ర మహేష్ తీవ్ర ఒత్తిడిని, సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ క్లైమాక్స్ మాత్రం తనను తీవ్రంగా వేధించిందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
నిర్మాత రామానాయకుడికి ఈ మూవీ కథ చెప్పినప్పుడు చాలా నచ్చిందని.. ముఖ్యంగా ప్రతీ ఒక్కరికి క్లైమాక్స్ గురించే వివరించేవారని అన్నారు. కానీ ప్రముఖ డాక్టర్ రాజు కథ విని.. క్లైమాక్స్ విషయంలో అభ్యంతరం చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఎవడో ట్రైన్ కింద చచ్చిపోతే వాడి హార్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారయ్యా ? హార్ట్ ఆపరేషన్ కు కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. బ్లడ్ గ్రూప్ ఉండాలి అంటూ వృత్తిపరమైన డౌట్స్ ఎత్తిచూపారని అన్నారు. తర్వాత రెండు రోజులుకు ఆర్.బీ. చౌదరి.. రామానాయుడిని కలవడానికి వచ్చారని.. కథ చెప్పగానే బాగుంది.. కానీ క్లైమాక్స్ మార్చాలని సలహా ఇచ్చారని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
అప్పటికే శ్రీకాంత్ వరుస ప్లాపులలో ఉన్నారని.. అతడు చనిపోతే ప్రేక్షకులు పట్టించుకోరని.. వెంకటేశ్ లాంటి హీరో నాలుక కోసుకుంటేనే జనం పట్టించుకోలేదని.. శ్రీకాంత్ గుండె ఆపరేషన్ గురించి ఆలోచించరని ఆయన అన్నారు. దీంతో రామానాయుడు ఆలోచించి.. మహేష్ మనం అనుకున్న క్లైమాక్స్ కరెక్ట్ కాదు.. అందరూ నెగిటివ్ అంటున్నారు అని అన్నారు. వెంటనే నేను క్లైమాక్స్ వదులుకోవడానికి ఇష్టపడలేదు. శ్రీకాంత్ చనిపోవద్దు.. మార్చాలి కాదా.. సరే ఆలోచిస్తాను అని చెప్పారు. కానీ నాకు ఏ ఆలోచన రాలేదు. వెంటనే రామానాయుడు కాళ్ల మీద పిడ.. ఈ సినిమా నచ్చిందని అన్నారు. క్లైమాక్స్ మార్చమన్నారు. కానీ దానికి మించిన క్లైమాక్స్ నాకు రావడం లేదని చెప్పాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాను. మీరు అనుకున్న దానికంటే నాలుగైదు రోజులు ముందే సినిమా తీశాను. ఒక్క రోజు కేటాయించండి.. ఈ క్లైమాక్స్ నచ్చకపోతే వేరేది చూద్దాం అని చెప్పాను. ఆయన ఒప్పుకున్నారు. చివరకు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అంటూ గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
