Mahesh Babu : మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా.. ఒక్క సీన్ తేడా జరిగితే నన్ను చంపేసేవాళ్లు.. డైరెక్టర్ కృష్ణవంశీ..
మహేష్ బాబు సినిమాలకు తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా మురారి సినిమాకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఇందులో మహేష్ అల్లరి, యాక్టింగ్, లుక్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ కృష్ణవంశీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా మురారి. 2001లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అందులో మహేష్ నటన, అల్లరి, లుక్స్ అన్నీ ప్రేక్షకులను ఫిదా చేశాయి. అలాగే డైరెక్టర్ కృష్ణవంశీ టేకింగ్, మణిశర్మ పాటలు సినిమాకు మరో హైలెట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి డైరెక్టర్ కృష్ణవంశీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మురారి సినిమాలో ఒక్క సీన్ తేడా జరిగితే ఖచ్చితంగా తనను చంపేసేవాళ్లని అన్నారు. మురారి షూటింగ్ వేగంగా జరిగిందని.. కానీ పతాక సన్నివేశం ఎలా అనేది తెగడం లేదని అన్నారు.
“మనసులో, మైండ్ లో అలజడి కలిగిందని.. క్లైమాక్స్ అస్పష్టంగానే ఉన్నప్పటికీ.. ఒక ఫైట్ తో సినిమాను ముగించాలని లేదని అన్నారు. అద్భుతం జరగాలి.. సరే అని తెగించి ఒక ఆలోచనను పట్టుకున్నా.. తనే చచ్చిపోతున్నానని మురారికి తెలిసిపోయిన తర్వాత తన చావుకీ… బామ్మ మాటకీ ఎదురు వెళ్తాడు.. దైవశక్తికి స్వశక్తికి అడ్డం వేస్తాడు.. కానీ బుల్లిగాడు గునపం దించేశాడు.. బొట్టు బొట్టులో ప్రాణం జారిపోతుంది. అది చూసి వసు స్పృహ తప్పి పడిపోయింది. బుల్లి రక్తం చూసి కంగారొచ్చేసి పారిపోయాడు…. విశాలమైన పొలాల మధ్య లో కనుచూపు మేరలో ఎవరూ లేరు….. తిరిగొస్తానని బామ్మకి మాటిచ్చాడు… స్రృహ లో లేని వసుని అక్కడినుంచి తీసుకెళ్ళి పోవాలి….. ఏ సహాయం లేదు.. రాదు… శరీరం సహకరించడం లేదు… ప్రాణం పోతూపోతూ వుంది… నాకు నేనే …. కూడగట్టుకోవాలి… నేను ఏ తప్పూ చేయునప్పుడు నేనెందుకు లొంగాలి చావైనా సరే నేను తగ్గను అంటూ. అనుకుంటూ నాకు నేనె వున్నానని …. గొప్పగా అనిపించింది కాన్సెప్ట్ అంతా…. ఇక మొత్తం మహేష్ కి ఎక్కించా….. చుట్టూ పంచభూతాలు తప్ప ఎవరూ వుండరు ఏమీ వుండదు…. ప్రాణం పోతున్న నొప్పి, ఎవరూ లేని అసహాయత ,ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి,వసూని తీసుకెళ్ళి పోవాలి… బామ్మ ఆఖరి పూజకి అందుకోవాలి…. చావకూడదు… బతకాలి.. వసూని పెళ్లి చేసుకోవాలి…. తల నిండా చిత్రమైన మంచీ చెడూ ఆలోచనలు… నవ్వొస్తూంది… ఏడుపొస్తాంది… నవ్వాలి…..ఏడవాలి….గంతులెయ్యాలి … డాన్స్ చేయాలి నొప్పి తో….. నొప్పి ని ఆపుకోవడానికి పాటపాడాలి….అరవాలి… గుర్తొచ్చి మట్టి తో గాయంమీద రాసుకోవాలి…పిచ్చిపిచ్చిగా …తిక్కతిక్కగా అటూఇటూ తిరగాలి……అమ్మ గుర్తొస్తోంది.. అందరూ గుర్తొస్తున్నారు…. మొత్తానికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి… సంకల్పం అంతే..మొత్తం అర్థమయేలా మహేష్ కి వివరించా…. గునపం గుచ్చుకున్న దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ ఏం చేయాలో చిన్న గుర్తులతో చెప్పా… రిహార్సల్ వద్దన్నా… డైరెక్ట్ టేక్ అన్నా…. ఒక సెకన్ నన్ను సూటిగా చూసి రెడీ సార్ అన్నాడు… ఈసీన్ కోసమే రామలింగేశ్వరరావు గారికి మూడు కెమెరాలు కావాలి అడిగా…. ఓకే సార్ అన్నారు… మూడు కెమెరాలు, లైటింగ్ అమరుస్తూ మహేష్ ఒక్కడ్నీ పది నిమిషాలు వదిలేసా…. మొత్తం ఆ ప్రదేశం అంతా యూనిట్ వందమంది, షూటింగ్ చూడటానికి వచ్చిన ఒక వెయ్యి మంది నిశ్శబ్దం… భయంకరమైన నిశ్శబ్దం…. మహేష్ తప్ప తెరమీద ఇంకెవ్వరూ కనపడని సన్నివేశం…. ఏమాత్రం ఈషణ్మాత్రం తేడా కొట్టనా అభాసుపాలు అయపోయే ప్రమాదం… మహేష్ ఒక సూపర్ స్టార్ గా ఒక నటుడిగా మేక్ ఆర్ బ్రేక్ … తేడా జరిగితే సీనియర్, జూనియర్ సూపర్ స్టార్ అభిమానులు డైరెక్టర్ గా నన్ను చంపేసే ఉపద్రవం…కానీ నాకు మహేష్ మీద మనసు మూలల్లో నాకే అర్థం కాని ఒక గొప్ప నమ్మకం వుంది… చింపేస్తాడు అని…కెమారాస్ రడీ అన్నాడు రాంప్రసాద్ … రడీయా మహేష్ అని కూడా అడగలేదు. క్లాప్ అని అసంకల్పితంగా వచ్చేసింది…
మహేష్ ఏం మాట్లాడలేదు… పొజిషన్ లోకి వెళ్లి పోయాడు…ఏక్షన్. అంతే… ఏకథాటిగా మూడు నిముషాల నలభై సెకన్లు….. ఆఖరులో కుండలో నీళ్ళు మొహం మీద ఒంపుకొని దాన్ని విసిరేస్తూ అదుపుతప్పి కింద పడిపోగానే కట్ చెప్పాను …. ఒక్క సారిగా అక్కడున్న వాళ్ళందరూ యూనిట్ అంతా కూడా చప్పట్లహోరు…. ఆగకుండా పదినిమిషాలు…… కొట్టేశాం అని అర్థం అయింది…. ఆర్నెల్ల ఆత్రత,అలజడి కుదుటపడింది….. దటీజ్ మహేష్…
P.S. ముందు రోజు రాత్రి షూటింగ్ అరటితోట ఫైట్ అయినతరువాత మరుసటిరోజు ఈసీను షూటింగ్…. అప్పటినుండి షూట్ అయ్యేంతవరకు ఏమీ తినొద్దు., మంచి నీళ్ళు,కాఫీ తప్ప… నాకు అప్పటికే రెండవరోజు…. సరే సార్ డైరెక్టర్ గారూ అని రామలింగేశ్వరరావు గారింటి నుంచి వచ్చిన డిన్నర్ క్యారేజీ ని అసిస్టెంట్ లకి పంపించేసాడు…. పస్తున్నాడు ఎఫెక్ట్ కోసం …. చాలా ఎత్తు కి ఎదుగుతాడు… కృష్ణ గారి పేరు ఇంకా పైకెత్తుతాడు అని కనపడి పోయింది” అంటూ ట్వీట్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
