AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమలపాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.? ఆ సమస్యకు రామ బాణమే..!

Betel leaves benefits: మన పూర్వకాలం నుంచి భోజనం తర్వాత తమలపాకులను తినడం సంప్రదాయంగా వస్తోంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో మన పూర్వీకులు కూడా తమలపాకులకు శుభ కార్యాలలో ఉపయోగించడంతోపాటు ఆహార పదార్థంగా కూడా తీసుకున్నారు. తమలపాకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అవి నివారించే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.? ఆ సమస్యకు రామ బాణమే..!
Betel Leaves
Rajashekher G
|

Updated on: Jan 26, 2026 | 3:44 PM

Share

Health Benefits of Betel Leaves: భారతీయ సంప్రదాయంలో తమలపాకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శుభ కార్యాలతోపాటు అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎక్కువగా పాన్‌లలో తమలపాకులను వినియోగిస్తారు. మన పూర్వకాలం నుంచి భోజనం తర్వాత తమలపాకులను తినడం సంప్రదాయంగా వస్తోంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో మన పూర్వీకులు కూడా తమలపాకులకు శుభ కార్యాలలో ఉపయోగించడంతోపాటు ఆహార పదార్థంగా కూడా తీసుకున్నారు. తమలపాకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అవి నివారించే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకుల్లో పోషకాలు

తమలపాకులు రుచికరమైనవే కాదు.. అనేక పోషకాలను కూడా కలిగి ఉన్నాయి. తమలపాకుల్లో కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, ఫైబర్ కలిగి ఉన్నాయి. తమలపాకులు పొట్టలో గ్యాస్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

తమలపాకులతో గ్యాస్ నుంచి ఉపశమనం

గ్యాస్ లేదా యాసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడంలో తమలపాకులది ముఖ్యమైన పాత్ర. రెండు టీ స్పూన్ల తేనె, అర టీస్పూన్ నిమ్మరసం, ఒక కప్పు నీరు, రెండు నుంచి మూడు తులసి ఆకులు అవసరం. తమలపాకులను కడిగి రెండు ముక్కలు చేసి.. గోరువెచ్చని నీటిలో పది నిమిషాలపాటు నాన బెట్టండి. తులసి ఆకులను కూడా నానబెట్టి.. ఈ రెండు ఆకుల రసాన్ని తీసి వడకట్టండి. ఈ రసంలో తేనె, నిమ్మరసం వేసి కలపండి. ఈ పానీయాన్ని ఉదయం లేదా భోజనం తర్వాత తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది.

తమలపాకుల ప్రయోజనాలు

తమలపాకులు జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతాయి. ఈ ఆకులలో ఉండే సహజ పదార్థాలు ఉబ్బరం, అజీర్ణం, తేలికపాటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాసిడిటీతో బాధపడేవారు తరచూ తమలపాకులను తినవచ్చు. అంతేగాక, ఈ ఆకులు దగ్గు, జలుబు, వాపు చిగుళ్లను తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.

తమలపాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.? ఆ సమస్యకు రామ బాణమే
తమలపాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.? ఆ సమస్యకు రామ బాణమే
బుధ, శుక్రల ప్రభావం.. ఆ రాశుల వారి కుటుంబ జీవితంలో అంతా హ్యాపీ..!
బుధ, శుక్రల ప్రభావం.. ఆ రాశుల వారి కుటుంబ జీవితంలో అంతా హ్యాపీ..!
పీఎఫ్ ఖాతాదారులకు కొత్త రూల్స్.. డబ్బులు పొందటం ఇక ఈజీ
పీఎఫ్ ఖాతాదారులకు కొత్త రూల్స్.. డబ్బులు పొందటం ఇక ఈజీ
కుప్పకూలనున్న వెండి మార్కెట్.. సగానికి సగం పడిపోనున్న ధరలు..
కుప్పకూలనున్న వెండి మార్కెట్.. సగానికి సగం పడిపోనున్న ధరలు..
గుర్రాలపై ఆదివాసీల నిరసన.. మూడు కిలోమీటర్లు యాత్ర చేసి
గుర్రాలపై ఆదివాసీల నిరసన.. మూడు కిలోమీటర్లు యాత్ర చేసి
ఇలా ఉన్నారేంట్రా.. నల్లగొండలో దృశ్యం సినిమాను మించిన సీన్..
ఇలా ఉన్నారేంట్రా.. నల్లగొండలో దృశ్యం సినిమాను మించిన సీన్..
పద్మశ్రీ పురస్కారం.. మనసులో మాట పంచుకున్న రాజేంద్రప్రసాద్
పద్మశ్రీ పురస్కారం.. మనసులో మాట పంచుకున్న రాజేంద్రప్రసాద్
సమ్మక్క జన్మించింది మేడారంలో కాదా? ఆ గ్రామ ప్రజల మాటేమిటంటే?
సమ్మక్క జన్మించింది మేడారంలో కాదా? ఆ గ్రామ ప్రజల మాటేమిటంటే?
Smartphone: వార్నీ.. ఫోన్ ఈ ప్లేస్‌లలో పెడితే అంత డేంజరా..?
Smartphone: వార్నీ.. ఫోన్ ఈ ప్లేస్‌లలో పెడితే అంత డేంజరా..?
చిన్న పిల్లలకు వెండి మొలతాడు ఎందుకు కడతారో తెలుసా?
చిన్న పిల్లలకు వెండి మొలతాడు ఎందుకు కడతారో తెలుసా?