AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మక్క జన్మించింది మేడారంలో కాదా? ఆ గ్రామ ప్రజల మాటేమిటంటే?

సమ్మక్క సారలమ్మ అనగానే మేడారం గుర్తుకొస్తుంది. అందరూ.. మేడారం వెళ్తుంటారు. చాలా మంది మేడారంలోనే సమ్మక్క తల్లి పుట్టింది అనుకుంటారు. కానీ సమ్మక్క పుట్టింది పొలాసలో అంటున్నారు అక్కడి వాసులు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 26, 2026 | 3:23 PM

Share
జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతరకు సిద్ధం అవుతుంటే. పొలాసవాసులు సమ్మక్క తమ ప్రాంతానికి చెందిన వీర వనిత గా చెప్పుకుంటున్నారు. జగిత్యాల సమీపంలోని పొలాస ను పాలించిన మేడ రాజు కూతురే సమ్మక్క అని ఆ ప్రాంత వాసుల నమ్మకం. ఇప్పటికే  పలు  పరిశోధనల్లో ఇక్కడే జన్మించిదని తేలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో సమ్మక్క కొలువై ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు. మేడ రాజుకి అటవీ ప్రాంతంలో శిశువు దొరికింది. ఆమెను తెచ్చుకొని పెంచుకొని సమ్మక్క గా నామకరణం చేశారు. తరువాత..మేనల్లుడు తో వివాహం జరిపించారు.

1 / 5
 జగిత్యాల రూరల్ మండలంలోని పొలావాసను 12వ శతాబ్దంలో పరిపాలించిన మెడేరాజు కూతురే సమ్మక్కగా చరిత్రకారులు చెబుతున్నారు.12వ శతాబ్దంలో  పొలావాస (నేటి పొలాస) ప్రాంతాన్ని పాలించే గిరిజన దొర మెడే రాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పడిగిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశార ని చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో సమ్మక్కను ఈ ప్రాంత ఆడబిడ్డగా చెప్పుకుంటున్నారు.ఈ దంపతులకు సారలమ్మ , నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు జంపన్న అనే కుమారుడు ఉన్నారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు,  పొలాసపై దండెత్తారు. ఆయన దాడికి తట్టుకోలేక మేడ రాజు  మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడిపినట్లు చరిత్ర  పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

2 / 5
మేడారం పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం చెల్లించలేక పోయాడు. కప్పం చెల్లించకపోవడం తో మేడ రాజుకు ఆశ్రయం కల్పించడం.. కోయ గిరిజనులలో సార్వభౌమునికి  వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని దిక్కరిస్తూ ఉన్నాడని పడిగిద్ద రాజు పై  మొదటి ప్రతాపరుద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారాని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అతనిని అణచివేయడానికి తన మంత్రి యుగంధరదు తో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తారు. సంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడి గిద్దరాజు సమ్మక్క సారక్క,నాగులమ్మ ,జంపన్న ,గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్దాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు.

3 / 5
అపార కాకతీయ సేన ధాటికి తట్టుకోలేక మేడ రాజ,పగిడి గిద్దరాజు,సారక్క,నాగులమ్మ,గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. జంపన్న కు తీవ్ర గాయాలయ్యాయి.  తరువాత సంపెంగ వాగులో శవమై తేలాడు. .అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు అశ్వర్య చకితుడయ్యాడు.  సమ్మక్క రక్తపు దారాల తోనే  చిలుకల గుట్ట వైపువెళ్తూ మార్గమధ్యంలోనే అదృశమవుతుంది.

4 / 5
సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్టదగ్గర  పసుపు,కుంకుమలు గల భరణి లభించింది. దానిని సమ్మక్కగా భావించి అప్పటినుంచి ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే..ఇప్పుడు పొలాస గ్రామం పై చర్చ సాగుతుంది. సమ్మక్క పెరిగిన ప్రాంతంలో. విగ్రహాలను ఏర్పాటు చేశారు. సమ్మక్క, సారలమ్మలకు ఎక్కడ విగ్రహాలు ఉండవు, కానీ ఈ ప్రాంతంలో మాత్రం విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు.

5 / 5