PF Account: పీఎఫ్‌లో మరో కొత్త రూల్.. ఇక నుంచి డబ్బులు పొందటం ఈజీ.. ఆ నిబంధన తొలగింపు
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన సమయంలో ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకునునేందుకు కుటుంబసభ్యులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఇక నుంచి సక్సెషన్ సర్టిఫికేట్ అందించాల్సిన అవసరం లేకుండా సుప్రీం కీలక తీర్పునిచ్చింది.

దేశంలో లక్షల మంది పీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. పీఎఫ్, ఈపీఎఫ్, జీపీఎఫ్ వంటి ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్లను కలిగి ఉన్నారు. వీరికి లబ్ది చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై వార్షిక వడ్డీ ఇవ్వడంతో పాటు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా అందిస్తోంది. ఇక ఇన్యూరెన్స్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి అకౌంట్లు కలిగినవారు మరణించిన సమయంలో కుటుంబసభ్యులు ఆ డబ్బులను పొందేందుకు ప్రాసెస్ చాలా కష్టతరంగా ఉండేది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పని సులువు కానుంది. తాజాగా వీరికి ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇక నుంచి పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన సమయంలో ఆ డబ్బులు పొందేందుకు కుటుంబసభ్యులు సక్సెషన్ సర్టిఫికేట్ అందించాల్సిన అవసరం లేదు.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఇక పీఎఫ్ ఖాతాదారులకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన సమయంలో ఇన్సూరెన్స్, పెన్షన్ లేదా పీఎఫ్ ఖాతాలోని డబ్బులు కుటుంబసభ్యులు పొందేందుకు ‘సక్సెషన్ సర్టిఫికేట్’ అవసరం లేదని స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో సామాన్య ప్రజలకు భారీ ఊరట కలిగినట్లయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ పరేష్ చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఈ మేరకు కీలక తీర్పు వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
-పీఎఫ్ ఖాతాదారుడు నామినీని నమోదు చేసినప్పుడు కుటుంబసభ్యులు డబ్బులు పొందేందుకు ప్రభుత్వ శాఖలు లేదా బ్యాంకులు సక్సెషన్ సర్టిఫికేట్ అడగకూడదు
-నామినేషన్ ఉద్దేశమే కుటుంబానికి డబ్బు త్వరగా అందేలా చేయడం. దానిని విఘాత కలిగేలా సర్టిఫికేట్లు అడగకూడదు
-ఈపీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులు నామినీ మాత్రమే తీసుకునేందుకు వీలవుతుంది. ఇతర చట్టబద్ధమైన వారసులు ఉంటే వారు నామినీ నుండి తమ వాటా కోసం సివిల్ కోర్టులో క్లెయిమ్ చేసుకోవచ్చు
-డబ్బు చెల్లింపుకు నామినీ సరిపోతాడు.. వాటాల నిర్ణయానికి వారసత్వ చట్టం వర్తిస్తుంది
సక్సెషన్ సర్టిఫికేట్ అంటే..?
పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన సమయంలో కుటుంబసభ్యులు తమకు డబ్బులు అందించాలని కోరుతూ సక్సెషన్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. దీనిని వారసత్వ ధృవీకరణ పత్రంగా పిలుస్తారు. ఈ సర్టిఫికేట్ కోసం బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇది వెంటనే ఇచ్చేవారు కాదు. దీని వల్ల రోజుల తరబడి తిరగాల్సి వచ్చేంది.
