యాదాద్రి జిల్లాలో పెద్దపులి సంచారంతో వారం రోజులుగా స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. యాదగిరిగుట్ట మండలం రాళ్ళ జనగాంలో పొన్నాల కిష్టయ్యకు చెందిన లేగ దూడను పెద్దపులి చంపడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అటవీ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పులి పాదముద్రలను సేకరిస్తున్నారు.