OTT Movie: తమిళ బ్లాక్ బస్టర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్.. కంటతడి పెట్టించే రియల్ క్రైమ్ స్టోరీ
థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ గతవారమే ఓటీటీలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. తమిళ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్న ఈ మూవీకి ఐఎమ్ డీబీలో 8.3 రేటింగ్ ఉండడం గమనార్హం.

ఆ మధ్యన రిలీజైన బలగం సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తెరకెక్కంచిన ఈ మూవీని చూసి ఆడియెన్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అలా ఇటీవల ఓ తమిళ సినిమాను చూసి ఆడియెన్స్ కన్నీళ్ల తో బయటకు వచ్చారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ మూవీకి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా థియేటర్ కు వెళ్లి మరీ ఈ మూవీని చూశాడంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.
ఈ మూవీ పేరుకు క్రైమ్ స్టోరీ అయినా ఒక ఎమోషనల్ డెప్త్ లవ్ స్టోరీ ఉంది. అందుకే ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ‘కదిరవన్’ అనే హెడ్ కానిస్టేబుల్ పాత్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అబ్దుల్ రౌఫ్ అనే విచారణా ఖైదీని జైలు నుంచి కోర్టుకు తరలించే క్రమంలో అతను తప్పించుకుంటాడు. మరి కదిరవన్ ఆ తప్పించుకున్న ఖైదీని తప్పించుకున్నాడా? అసలు ఈ అబ్దుల్ ఎవరు ? ఆ హత్య కేసు ఏమిటి ? కదిరవన్ ఏం చేశాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే ఈ క్రైమ్ డ్రామా సినిమాను చూడాల్సిందే.
సిరై సినిమాపై ఒక నెటిజన్ రివ్యూ..
It’s an excellent mind blowing, very emotional true love movie 👌💥 బాబోయ్ కన్నీళ్ళు ఆగలేదు చివరి వరకు ఏం అవుతుంది అని ఇంట్రెస్ట్ గా ఉంది 🔥 క్లైమాక్స్ వెరీ ఎమోషనల్ 😭🥺
రియల్ లైఫ్ ఆధారంగా తీసిన మూవీ 👌 ఎక్స్లెంట్ 🔥💥 డోంట్ మిస్ ఇట్ #Sirai #siraionzee5 pic.twitter.com/YLfATwKrnK
— ☕🐦 (@naadoprapancham) January 26, 2026
ఈ సినిమా ‘సిరై’. అంటే తమిళంలో జైలు అని అర్థం. విక్రమ్ ప్రభు, అక్షయ్ కుమార్, అనిష్మా ప్రధాన పాత్రలు పోషించారు. మూడు రోజుల క్రితమే ఈ మూవీ జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. మంచి ఎమోషనల్ మూవీ చూడాలనుకునేవారికి సిరై ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
జీ5లో స్ట్రీమింగ్..
#Sirai now streaming on @ZEE5India in Telugu, Tamil, Kannada & Malayalam🍿!!#SiraiOnZee5#Zee5#TeluguOTTUpdates#TeluguOTT pic.twitter.com/0ajYaJLxiI
— Telugu OTT Updates (@TeluguOTTUpdts) January 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




