Gold Prices: అయ్య బాబోయ్.. 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే మైండ్ బ్లోయింగే..! బాంబ్ పేల్చే వార్త
బంగారం ధరలు ప్రస్తుతం వేగంగా పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం తులం బంగారం రూ.1.40 లక్షల వద్ద ఉండగా.. ఇప్పుడు రూ.1.60 లక్షలకు చేరుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో గోల్డ్ రేటు రానున్న రోజుల్లో మరింతగా పెరగనుంది. అయితే 2050 నాటికి ఎంత పెరుగుతుందని ఏఐ టూల్స్‌ని అడగ్గా.. షాకింగ్ అంచనాలు వచ్చాయి.

ప్రస్తుతం బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్‌పై అమెరికా యుద్దానికి దిగే అవకాశముందనే వార్తల క్రమంలో బంగారం, వెండి రేట్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికా యుద్ద నౌకలు ఇరాన్ వైపు దూసుకుపోతుండగా.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్‌లో తలదాచుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో బంగారం రేట్లు భారీ స్థాయిలో పెరుగుతుండగా.. ఈ వారంలో మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో గోల్డ్ కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. అటు పెరుగుతున్న ధరలతో డిజిటల్ గోల్డ్‌లో ఇన్‌వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్నాయి.
2050 నాటికి అంత పెరుగుతాయా..?
ప్రస్తుతం తులం బంగారం రూ.1.60 లక్షల వద్ద కొనసాగుతోంది. రెండు వారాల క్రితం రూ.1.45 లక్షల వద్ద ఊగిసలాడగా.. అంతర్జాతీయంగా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ధరలు ఒక్కసారిగా పెరుగుతూ వస్తోన్నాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుటుండటంతో రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు మరింతగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. 2025 ప్రారంభంలో తులం బంగారం రూ.90 వేలే ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.1.60 లక్షలకు చేరకున్నాయి. ఈ ఏడాదిలో 2 లక్షల మార్క్‌ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 2050 నాటికి బంగారం రేట్లు ఎంత పెరుగుతాయనేది ఏఐ టూల్స్‌ని అడగ్గా.. షాకింగ్ రిజల్ట్స్ బయటకొచ్చాయి.
ఏఐ టూల్స్ అంచనాలు
2050 నాటికి గోల్డ్ రేట్లు ఎంతవరకు పెరుగుతాయో చెప్పాలని ఏఐ టూల్స్ అయిన చాట్ జీపీటీ, గ్రోక్, గూగుల్ జెమినీని అడగ్గా సుమారుగా ఒకేలా సమాధానం ఇచ్చాయి. 2050 నాటికి తులం బంగారం రూ. 40 లక్షలకు చేరుకునే అవకాశముందని అంచనా వేశాయి. గత కొన్నేళ్లుగా గోల్డ్ రేట్లలో జరుగుతున్న మార్పులను అంచనా వేసి భవిష్యత్తులో ఎంత పెరుగుతాయనేది వార్షిక వృద్ధి రేటును అంచనా వేసి ఏఐ టూల్స్ వివరాలు ఈ మేరకు ఇచ్చాయి. 10 శాతం వార్షిక పెరుగుదల నమోదు చేస్తే 2050 నాటికి 10 గ్రాముల బంగారం రూ.14 నుంచి రూ.15 లక్షలకు చేరుకోవచ్చని ఏఐ టూల్స్ చెబుతున్నాయి. ఇక బలమైన డిమాండ్, రూపాయి విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణ ప్రభావాలు కొనసాగితే 2050 నాటికి రూ.20 నుంచి రూ.22 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశాయి.
ఆర్ధిక అనిశ్చితి
ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, డాలర్ బలహీనపడటం, ద్రవ్యోల్బణం పెరగడం, కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి అధిక డిమాండ్ వంటి పరిస్థితులు మరింతగా పెరిగితే తులం బంగారం రూ.40 లక్షలకు కూడా 2050 నాటికి చేరుకోవచ్చని ఏఐ టూల్స్ అంచనా వేస్తున్నాయి.
Hey@grok gold inr per 10gm target in 2050 year ?
— A K Mandhan (@A_K_Mandhan) January 7, 2026
