AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బంగారం ధర రూ.8 కోట్లకు పెరుగుతుందా.. ఈ విషయాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

బంగారం సామాన్యుడి కలగా మిగిలిపోనుందా? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసిడి సరికొత్త రికార్డును తిరగరాసింది! అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 5,000 డాలర్ల మార్కును దాటేసింది. అంటే మన దగ్గర గ్రాము బంగారం ధర రూ.16,400 దాటిపోయింది. భవిష్యత్తులో కిలో బంగారం రూ. 8 కోట్లు అవుతుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Gold: బంగారం ధర రూ.8 కోట్లకు పెరుగుతుందా.. ఈ విషయాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
Robert Kiyosaki Gold Price Predicts
Krishna S
|

Updated on: Jan 26, 2026 | 4:34 PM

Share

భారతీయులకు బంగారం అంటే ప్రత్యేక సెంటిమెంట్. శుభకార్యమైన లేదా పండగైనా బంగారం కొనాల్సిందే.. బంగారం వారీ భాగమైపోయింది. అయితే ప్రస్తుత ధరలు సామాన్యుడికి గట్టి షాక్ ఇస్తున్నాయి. గత కొంత కాలంగా పసిడి పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ మైలురాయిని అధిగమించింది. సోమవారం స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 5,092 డాలర్లకు చేరుకుంది. అంటే భారతీయ కరెన్సీలో ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.16,410 కి పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఎందుకీ పసిడి పరుగు? నిపుణులు ఏమంటున్నారు?

  • బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి..
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి.
  • అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలహీనపడటం పసిడికి వరంగా మారింది.
  • రాజకీయ అనిశ్చితి, యుద్ధ మేఘాల వల్ల పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు.
  • ట్రేడ్ వార్, కొత్త సుంకాల ప్రభావం మార్కెట్లను కుదిపేస్తోంది.
  • గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు గతంలో కంటే భారీగా పెరిగాయి.

ముందుంది ముసళ్ల పండుగ

ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థలు బంగారం ధరలపై సంచలన అంచనాలు వేస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్స్ 2026 డిసెంబర్ నాటికి ఔన్సు ధర 5,400 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. మెటల్స్ ఫోకస్ ఈ ఏడాది చివరి నాటికి ధర 5,500 డాలర్ల వరకు వెళ్లొచ్చని తెలిపింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే అంశం ఏంటంటే..రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా. భవిష్యత్తులో ఔన్సు బంగారం ధర 27,000 డాలర్లకు చేరుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఆయన అంచనా నిజమైతే, ఒక గ్రాము బంగారం ధర రూ. 87,154 అవుతుంది. అప్పుడు ఒక కిలో బంగారం కొనాలంటే ఏకంగా రూ. 8.71 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఈ ధర ఎప్పటికి చేరుకుంటుందనే దానిపై ఆయన కాలపరిమితి ప్రకటించలేదు. అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ఎప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుంది. ప్రస్తుత ధరలను చూస్తుంటే సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షలా మారుతోందని స్పష్టమవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Lucky Zodiac Signs: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!
Lucky Zodiac Signs: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!
పదేళ్లుగా పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్
పదేళ్లుగా పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్
పోలీస్ జాబ్ అంటే ప్రాణం.. గంజాయ్ ముఠాను పట్టుకునేందుకు వెళితే..
పోలీస్ జాబ్ అంటే ప్రాణం.. గంజాయ్ ముఠాను పట్టుకునేందుకు వెళితే..
బాక్సాఫీస్ కింగ్.. రూ.4 లక్షల జీతం..ఇప్పుడు..
బాక్సాఫీస్ కింగ్.. రూ.4 లక్షల జీతం..ఇప్పుడు..
వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..
వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..
ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు
ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు
పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది
పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది
పట్టువీడని విక్రమార్కుడిలా.. అనుకున్నది సాధించే రాశులివే..!
పట్టువీడని విక్రమార్కుడిలా.. అనుకున్నది సాధించే రాశులివే..!
భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ పాక్ బెదిరింపులు..?
భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ పాక్ బెదిరింపులు..?
ఇది పెళ్లి కార్డా లేక ఖజానా పెట్టెనా? వెడ్డింగ్‌ కార్డ్‌ పేరుతో
ఇది పెళ్లి కార్డా లేక ఖజానా పెట్టెనా? వెడ్డింగ్‌ కార్డ్‌ పేరుతో