Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: మూడు రోజులుగా ఐటీ సోదాలు.. దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

టీఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజులుగా దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దీంతో భయంతోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Dil Raju: మూడు రోజులుగా ఐటీ సోదాలు.. దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Dil Raju
Follow us
Basha Shek

|

Updated on: Jan 23, 2025 | 2:51 PM

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో |గ‌త మూడు రోజులుగా ఐటీ సోదాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు అత‌డి భార్య‌ను విచారించారు. వారి బ్యాంక్ వివరాలను అడిగిన‌ట్లు స‌మాచారం. అయితే గ‌త మూడు రోజులుగా జ‌రుగుతున్నఐటీ సోదాల నేప‌థ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలోనే ఆమెని హాస్పిటిల్‌కు తీసుకెళ్లారు. వారి వెంట ఐటీ శాఖకు సంబంధించిన మహిళా అధికారి కూడా వెళ్లారు. కాగా ఐటీ అధికారులు.. దిల్ రాజు  తో పాటు ఆయన కొడుకు శిరీష్, కూతురు హన్సీత రెడ్డి, బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. 55 బృందాలుగా  విడిపోయిన అధికారులు గత మూడు రోజులుగా  తనిఖీలు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ ఐటీ దాడుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీతో పాటు, రాజకీయాల్లో కూడా  హాట్ టాపిక్ గా మరింది

ఇవి కూడా చదవండి

కాగా ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి.   ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.  వందల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా   రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది.  ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు దిల్ రాజు ఇంట్లో దాడులు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా దిల్‌ రాజు ఆఫీస్, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు

ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌, మ్యాంగో మీడియా సంస్థల్లోను తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడులు,  కలెక్షన్లపై ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.  మరో వైపు ఐటీ సోదాలపై నిర్మాత, FDC ఛైర్మన్‌ దిల్‌రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని.. ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక లేటెస్ట్ గా విక్టరీ వెంకటేశ్ కూడా ఐటీ తనిఖీలపై స్పందించారు.  దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం తనకు తెలియదన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.