AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.. ఊర్వశి ఆసక్తికర కామెంట్స్

బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యాజైస్వాల్, శ్రద్దా శ్రీనాద్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది.

బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.. ఊర్వశి ఆసక్తికర కామెంట్స్
Urvashi Rautela
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2025 | 1:36 PM

Share

వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో నటి శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, “అనంతపురం ప్రజలకు, బాలకృష్ణ గారి అభిమానులకు నా నమస్కారం. అనంతపురంకి మొదటిసారి వచ్చాను. ఇక్కడి మనుషులు చాలా స్వీట్ అని చూస్తుంటునే తెలుస్తుంది. బాలకృష్ణ గారు ఒక మాస్ ఐకాన్, ఒక లెజెండ్. ఆయనతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ గారు ఎంతో ప్రతిభావంతులు. ఆయన దర్శకత్వంలో మరిన్ని చేయాలని ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో జెర్సీ తర్వాత డాకు మహారాజ్ లాంటి మరో గొప్ప సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి ధన్యవాదాలు. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. మూవీ టీంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఈ సినిమా కోసం పనిచేశారు. అనంతపురం ప్రజల ప్రేమను మరిచిపోలేను.” అన్నారు.

అలాగే నటి ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. బాబీ గారు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప స్టోరీ టెల్లర్. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారు. బాలకృష్ణ గారు లాంటి లెజెండ్ తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారి నట వారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచిన నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు.” అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి