AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhupriya: పవిత్రమైన గర్భగుడిలో ఇదేం పని? సింగర్ మధుప్రియపై హిందువుల ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?

'ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని' పాటతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫోక్ సింగర్ మధు ప్రియ. ఆమె తీయటి గొంతుకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇటీవల రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మధు ప్రియ పాడిన గోదారి గట్టుమీద సాంగ్‌ కూడా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Madhupriya: పవిత్రమైన గర్భగుడిలో ఇదేం పని? సింగర్ మధుప్రియపై హిందువుల ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?
Singer Madhupriya
Basha Shek
|

Updated on: Jan 23, 2025 | 3:32 PM

Share

ప్రముఖ సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుతుంది. ఆమెపై హిందువులు, బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. సింగర్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం సినిమా సాంగ్స్ తో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది మధు ప్రియ. అయితే తాజాగా తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ను భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో షూటి చేయడం వివాదానికి దారి తీసింది. అది కూడా భక్తులు దర్శనానికి రాకుండా గుడి తలుపులు మూసేసి గర్భగుడిలో సాంగ్ షూటింగ్ జరపడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మధు ప్రియ తీరుపై పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భగుడిలో సాంగ్ షూట్‌కు అనుమతి ఎవరు ఇచ్చారంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో మధు ప్రియ పాట పాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవాలయంలో ఫొటోలు తీయడానికి అనుమతి లేనప్పుడు మధుప్రియ గర్భగుడిలోకి ఎలా వెళ్లిందని భక్తులు ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మధుప్రియతో పాటు ఆలయ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ మండి పడుతున్నారు.

చాలా వరకు ఆలయాల్లో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం ఉంది. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలోనూ ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదు. అయితే మధుప్రియతో పాటు ఆమె బృందం ఏకంగా గర్భగుడిలోకి వెళ్లి పాటను చిత్రీకరించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతితోనే ఆలయంలో పాట చిత్రీకరించారని ప్రచారం జరగుతోంది. అదేమీ కాదని, స్థానికంగా ఉండే ఆలయ సిబ్బందిని ఒప్పించి ఈ పాటను చిత్రీకరించారని మరికొందరు అంటున్నారు. మరి దీనిపై తెలంగాణ దేవాదాయ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆలయంలో మధుప్రియ..

గోదారి గట్టు మీద పాటతో..

సింగర్ మధు ప్రియ ఇటీవల రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టుమీద సాంగ్‌ను ఆలపించింది. మేల్ వెర్షన్ లో రమణ గోగుల ఈ సాంగ్ ను ఆలపించగా, లేడీ వెర్షన్ లో మధు ప్రియ పాండింది. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.