AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటీ.. ఈ టాలీవుడ్ హీరో దివంగత ప్రధాని పీవీ మనవడా? ఏయే సినిమాల్లో నటించాడో తెలుసా?

సినిమాల్లో రాణించాలంటే బ్యాక్ గ్రౌండ్ చాలా అవసరం. మరీ ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో సినిమా ఛాన్సులు రావాలంటే ఎవరో ఒకరి పేరు చెప్పుకోవాల్సిందే. కానీ ఈ టాలీవుడ్ నటుడు మాత్రం అలా చేయలేదు. భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు వరుసకు మనవడు అయ్యే అతను ఏనాడూ కూడా తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకోకుండానే సినిమాల్లో రాణిస్తున్నారు.

Tollywood: ఏంటీ.. ఈ టాలీవుడ్ హీరో దివంగత ప్రధాని పీవీ మనవడా? ఏయే సినిమాల్లో నటించాడో తెలుసా?
PV Narasimha Rao
Basha Shek
|

Updated on: Jun 30, 2025 | 7:14 PM

Share

సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి ఇండస్ట్రీలో అవకాశాలు తొందరగా వస్తాయి. అదే సమయంలో ఎలాంటి సినిమా నేపథ్యం, గాడ్ ఫాదర్లు లేనివారు మాత్రం ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చుకోవాలన్నా, సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలన్నా చాలా కష్టపడాల్సిందే. అయితే కొందరు మాత్రం లాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో టాలెంట్ నిరూపించుకుంటూ ఉన్నారు. స్వయం కృషితోనే సినిమాల్లో స్టార్స్ గా రాణిస్తున్నారు. అయితే ఈ నటుడిది మాత్రం చాలా డిఫరెంట్ స్టోరీ. భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతటి దిగ్గజ రాజకీయ నాయకుడి మనవడు అయినప్పటికీ సాధారణ నటుల్లానే ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏనాడూ కూడా తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకోకుండానే నటుడిగా ఎదుగుతున్నాడు. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారా? సాయి తేజ.. ఈ పేరు చెబితే గుర్తు పట్టలేరు కానీ.. ఫొటోలు చూస్తే మీకు అర్థమవుతుంది.

కెరీర్ ప్రారంభంలో చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాడు సాయి తేజ. ముఖ్యంగా యూత్‌కు నచ్చే కంటెంట్ తో యూట్యూబ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘A Silent Melody’, ‘I Love You Idiot’, ‘Yours Lovingly’, పిల్ల పిల్లగాడు వంటి షార్ట్ ఫిల్మ్స్ సాయి తేజకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ క్రేజ్ తోనే నాగ చైతన్య, సమంతల సినిమా మజిలీ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అందులో అతను కునాల్ అనే చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత పైలాం పిలగా, మై నేమ్ ఈజ్ శ్రుతి వంటి సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతం సాయి తేజ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నటుడు సాయి తేజ లేటెస్ట్ ఫొటోస్..

కాగా ఓ సందర్భంలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడిన సాయి తేజ .. ‘మా ఇంట్లో అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే. ఐపీఎస్ లు, ఐఏఎస్ లు, లాయర్లు ఇలా చాలా మంది ఉన్నారు. అయితే వారందరి మాదిరి కాకుండా నాకెంతో ఇష్టమైన సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. పీవీ నరసింహారావు గారి కూతుర్ని మా పెదనాన్న పెళ్లి చేసుకున్నారు. అలా ఆయన నాకు తాత వరస అవుతారు’ అని చెప్పుకొచ్చాడు సాయి తేజ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .