AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ స్టార్ హీరోయిన్ తండ్రి రియల్ హీరో.. ఆర్మీ మేజర్‌గా దేశం కోసం ప్రాణాలే త్యాగం చేశాడు

జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందాడు. అతని లాగే గతంలో దేశంమీద ప్రేమతో ఎంతో మంది ప్రాణాలు అర్పించి అమరజీవులు అయ్యారు. ఈ స్టార్ హీరోయిన్ తండ్రి కూడా సరిహద్దుల్లో పహారా కాస్తూ ప్రాణలు కోల్పోయాడు.

Tollywood: ఈ స్టార్ హీరోయిన్ తండ్రి రియల్ హీరో.. ఆర్మీ మేజర్‌గా దేశం కోసం ప్రాణాలే త్యాగం చేశాడు
Bollywood Actress
Basha Shek
|

Updated on: May 11, 2025 | 12:03 PM

Share

పాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏపీ జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందాడు. ఎల్ ఓసీ వద్ద పాక్ సైన్యం జరిగిన కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కన్నుమూశాడు. మురళీ నాయకే కాదు గతంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవానులు చాలా మంది ఉన్నారు. వారి త్యాగాల ఫలితంగానే ఇప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఇలా దేశం కోసం సరిహద్దుల్లో సేవ చేస్తున్న వారిలో సామాన్యులే కాదు సినిమా ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఉన్నారు. ఈ స్టార్ హీరోయిన్ తండ్రి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు. ఆర్మీ మేజర్ గా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన ఆయన ఉగ్రవాదులతో పోరాడారు. చివరికి వారి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ ప్రముఖ నటి నిమ్రత్ కౌర్. ఆమె తండ్రి ఆర్మీ మేజర్ భూపేంద్ర సింగ్. 1994లో జమ్మూ శ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ కన్నుమూశారాయన. అప్పుడు నిమ్రత్ వయసు సుమారు 11 సంవత్సరాలు మాత్రమే.

నిమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపేంద్ర సింగ్ ను 1994లో కాశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. తమ చెరలో ఉంచుకుని దారుణంగా చిత్ర హింసలు పెట్టారు. తమ డిమాండ్లు తీరిస్తేనే ఆయన్నువిడుదల చేస్తామన్నారు. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉగ్రవాదుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గలేదు. ఇక మేజర్ భూపేంద్ర సింగ్ కూడా ఉగ్రవాదలు చెప్పినట్లు చేయడానికి నిరాకరించారు. దీంతో టెర్రరిస్టులు ఏడు రోజుల పాటు కస్టడీలో ఉంచిన తర్వాత ఆయనను దారుణంగా హత్య చేశారు. నిమ్రత్ కౌర్ చెప్పినదాని ప్రకారం తన తండ్రిని విడుదల చేసినందుకు ప్రతిగా ఉగ్రవాదులు తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గలేదు.

ఇవి కూడా చదవండి

తండ్రి స్మారక చిహ్నం దగ్గర నిమ్రత్ కౌర్..

కాగా ఆర్మీ మేజర్ భూపేంద్ర సింగ్ త్యాగానికి గుర్తుగా, ఆయన జ్ఞాపకార్థం మోహన్‌పురాలో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇప్పటికీ తరచూ అక్కడకు వెళుతుంది నిమ్రత్ కౌర్. ఇక తండ్రి జయంతి రోజున ఆయన ఆర్మీ డ్రెస్ ధరించి తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది.

నిమ్రత్ కౌర్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు