AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya: నిఖిల్ బ్లాక్ బాస్టర్ కార్తికేయను మిస్ చేసుకున్న మరో యంగ్ హీరో ఎవరో తెల్సా..?

కొన్ని భయాలు, సెంటిమెంట్స్ కారణంగా హీరోలు కొన్ని కథలను రిజెక్ట్ చేస్తారు. ఆ సబ్జెక్ట్స్‌ను వేరే హీరోలు చేస్తే బ్లాక్ బాస్టర్ అవుతూ ఉంటాయి. అలానే నిఖిల్ సూపర్ హిట్ సినిమాను ఓ యంగ్ హీరో మిస్ చేసుకున్నాడు. అతనెవరో తెలుసుకుందాం పదండి..

Karthikeya: నిఖిల్ బ్లాక్ బాస్టర్ కార్తికేయను మిస్ చేసుకున్న మరో యంగ్ హీరో ఎవరో తెల్సా..?
Karthikeya Movie
Ram Naramaneni
|

Updated on: May 13, 2023 | 1:11 PM

Share

స్క్రిప్ట్ సెలక్షన్‌లో యంగ్ హీరో నిఖిల్‌కు తోపు అన్న పేరుంది. టాలీవుడ్‌లో అధికంగా సక్సెస్ రేట్ ఉన్న హీరో అతడే. వరస విజయాలతో మంచి జోరుమీదున్నాడు ఈ కుర్ర హీరో. నిఖిల్ కెరీర్ కార్తికేయ ఎప్పుడూ ఓ స్పెషల్. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. కేవలం 6 కోట్ల బడ్జెట్ పెడితే.. ఇంచుమించు 20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా దర్శకుడు చందూ మొండేటి.. ఈ స్టోరీని తోలుత మరో హీరో అల్లరి నరేశ్‌కు చెప్పారట. కథ నరేశ్‌కు కూడా విపరీతంగా నచ్చిందట. కానీ కథలో భాగంగా ఈ సినిమాలో పాములతో సన్నివేశాలు చాలా కీలకం. అయితే నరేశ్‌కి పాములంటే చాలా భయం. అందుకే సినిమాను రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బయట పాము కనిపిస్తే ఆమడదూరం పారిపోతానని.. అలాగే సినిమాల్లో పాముల ఉన్న సీన్స్ వచ్చినా భయపడతానని నరేశ్ వెల్లడించాడు. 2014 అక్టోబరు 14న కార్తికేయ విడుదలయ్యింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ 2022 ఆగస్టు 13న విడుదలయ్యి సంచలన విజయం సాధించింది నిఖిల్‌కి పాన్ ఇండియా హీరోని చేసింది.

అది పక్కనపెడితే ఈ మధ్య నరేశ్ ట్రాక్ మార్చారు. తన శైలికి భిన్నంగా సినిమాలు చేస్తున్నారు. ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’  అంటూ కొత్త కథలు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం విభిన్న కథలతో దర్శకులు తనను అప్రోచ్ అవుతున్నట్లు నరేశ్ తెలిపారు. ‘కార్తికేయ’లో నటించి ఉంటే అప్పటి నుంచే.. విభిన్న స్క్రిప్ట్ ఆయన వద్దకు వచ్చేవేమో..! కాగా వరుసగా యాక్షన్‌ తరహా సబ్జెక్ట్‌లకే పరిమితం కాకుండా కామెడీ సినిమాలూ చేస్తుంటానని నరేశ్ వెల్లడించాడు.

Allari Naresh

Allari Naresh

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.