Naga Chaitanya: నాగచైతన్యతో సినిమా చేయడానికి ‘నో’ చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరంటే..

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నాగచైతన్య.. ఇప్పుడు కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతోపాటు..తమిళంలోనూ మే 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటించింది.

Naga Chaitanya: నాగచైతన్యతో సినిమా చేయడానికి 'నో' చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరంటే..
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: May 13, 2023 | 12:49 PM

జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్నారు అక్కినేని నాగచైతన్య. థియేటర్లలో ఈ సినిమా అంతగా మెప్పించకపోయినా…నటనతో మెప్పించాడు చైతూ. ఆ తర్వాత రెండవ సినిమా ఏమాయ చేశావే సూపర్ హిట్ అందుకుని.. హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నాగచైతన్య.. ఇప్పుడు కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతోపాటు..తమిళంలోనూ మే 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటించింది. బంగార్రాజు సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమిది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రేవతి పాత్రకు ముందుగా అనుకున్న బ్యూటీ కృతి కాదట. మరో స్టార్ హీరోయిన్‏ను ఎంపిక చేయగా.. చిన్న కారణాలతో ఆమె రిజెక్ట్ చేసిందని.. చివరకు కృతిని ఎంపిక చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కృతి శెట్టి కంటే ముందుగా నేషనల్ క్రష్ రష్మికను తీసుకోవాలనుకున్నారట. ఇదే విషయమై ఆమెను సంప్రదించగా.. హీరోయిన్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని రిజెక్ట్ చేసిందట. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగుతోపాటు.. తమిళ్, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం కూడా ఒక కారణమే అని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

ఇందులో చైతూ కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపించగా.. అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించాడు. దాదాపు ఏ సినిమాలో అయినా.. విలను అంతం చేసేందుకు హీరో పోరాడతాడు.. కానీ ఇక్కడ మాత్రం విలన్ ను కాపాడటానికి ప్రయత్నిస్తుంటాడు. మొదటి రోజే ఈ సినిమా రూ. 22 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.