Bimbisara: బ్లాక్ బస్టర్ మూవీ బింబిసారను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో..
నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ బింబిసార. 2022లో విడుదలైన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించంది. ఈ మూవీ కారణంగానే డైరెక్టర్ మల్లిడి వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఆఫర్ వచ్చింది.

నందమూరి హీరో కల్యాణ్ రామ్ తన కెరీర్‌లో మర్చిపోలేని సినిమా బింబిసార. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ అభినయం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. బింబిసారుడిగా, దేవ దత్తగా నందమూరి హీరో అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విశ్వంభర డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీలో క్యాథరిన్ థెరీసా, సంయుక్త మేనన్ లు హీరోయిన్లు గా నటించారు. 2022 ఆగస్టు05న థియేటర్లలో విడుదలైన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. హీరో కల్యాణ్ రామ్, డైరెక్టర్ వశిష్ట ల కెరీర్ లో మరుపురాని మూవీగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా 60 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. అయితే ఈ బింబిసార మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం చాలా మందికి తెలియదు. అదేమీటంటే.. ఈ సినిమాకు నందమూరి కల్యాణ్ రామ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ హీరో కంటే ముందు డైరెక్టర్ వశిష్ట చాలా మంది హీరోలను అప్రోచ్ అయ్యాడట. అలాగనీ ఎవరూ ఇతనికి నో చెప్పలేదట. కానీ కొన్నేళ్లు ఆగు అని ఆన్సర్స్ ఇచ్చారట.
బింబిసార సినిమాను రిజెక్ట్ చేసిన వారిలో మాస్ మహరాజా రవితేజ కూడ ఉన్నాడట. రవితేజకు వశిష్టకు మంచి పరిచయం ఉంది. దీంతో బింబిసార కథ విన్న రవి తేజ కొన్ని రోజుల పాటు వశిష్టతో చర్చలు కూడా జరిపాడట. అయితే సినిమాలో హీరోకు నెగెటివ్ షేడ్స్ ఉండడంతో రవితేజ ఆలోచనలో పడ్డాడట. దీనికి తోడు మరిన్ని కారణాలతో రవితేజ బింబిసార మూవీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో చివరికీ ఈ సినిమా కల్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లిందట. కథ విన్న నందమూరి హీరో వెంటనే ప్రాజెక్టుకు ఓకే చెప్పేయడంతో బింబిసార మూవీ పట్టాలెక్కిందట.
View this post on Instagram
బింబిసారతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ వశిష్ట ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది కూడా సోషియో ఫాంటసీ మూవీనే కావడం విశేషం.
చిరంజీవితో డైరెక్టర్ వశిష్ట..
Wishing my dearest BOSS, Megastar @KChiruTweets garu a very Happy Birthday! ❤️#HBDMegastarChiranjeevi 💫 pic.twitter.com/5l0mH556vR
— Vassishta (@DirVassishta) August 22, 2024
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








