- Telugu News Photo Gallery Cinema photos Are hit actresses busy? Is there a shortage of heroines in Tollywood?
Hit Heroines: హిట్ భామలు బిజీగా అయిపోయారా.? టాలీవుడ్లో హీరోయిన్స్ కరువైనా.?
ఇండస్ట్రీలో హీరోయిన్లు లేరు లేరు అంటుంటారు. కానీ హిట్ ఇచ్చిన హీరోయిన్స్‌ను మాత్రం సరిగ్గా వాడుకోరు మన దర్శకులు. తెలుగు ఇండస్ట్రీలో మరోసారి ఇదే జరుగుతుందా..? ఈ ఏడాది చాలా మంది బ్యూటీస్ ఖతర్నాక్ హిట్స్ ఇచ్చారు. మరి వాళ్లందరూ బిజీగా ఉన్నారా..? అసలెవరెవరు ఈ ఏడాది హిట్ ఇచ్చారో చూద్దామా..?
Updated on: May 17, 2025 | 4:15 PM

2025లో తెలుగు ఇండస్ట్రీకి టైమ్ బాగానే కలిసొస్తుంది. ఆర్నెళ్లు తిరక్కముందే 9 సినిమాలు క్లీన్ హిట్ అయ్యాయి. అందులో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. పండక్కి వచ్చి 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఈ సినిమాతో వరస ఫ్లాపుల్లో ఉన్న మీనాక్షి చౌదరి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు..

అలాగే ఐశ్వర్యా రాజేష్ అందరి కళ్లలో పడ్డారు. ఇందులో ఈమె నటన వసూళ్లకు చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. కౌసల్య కృష్ణ మూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ సినిమా తర్వాత మరోసారి తెలుగులో ఐశ్వర్యా నటించిన చిత్రమిది.

సంక్రాంతి హీరోయిన్స్ తర్వాత.. హిట్ 3తో మాయ చేసారు శ్రీనిథి శెట్టి. కేజియఫ్ తర్వాత సరైన సక్సెస్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి నాని రూపంలో సేవియర్ దొరికారు. భారీ అంచనాలతో వచ్చిన హిట్ 3తో తెలుగులో ఖాతా తెరిచారు శ్రీనిథి. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో తెలుసు కదాలో నటిస్తున్నారు ఈ భామ.

కరోనా టైమ్‌లో రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ కేతిక శర్మ. ఈ గ్యాప్‌లో మూడు నాలుగు సినిమాలు చేసినా.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు సింగిల్ సినిమాతో మచ్ నీడెడ్ హిట్ కొట్టారు కేతిక శర్మ.

ఆమెతో పాటు లవ్ టుడే ఫేమ్ ఇవానా కూడా ఇదే సినిమాతో హిట్ కొట్టారు. దీనికి ముందు ధోని నిర్మిణంలో ఎల్జిఎం సినిమా చేసిన అంతగా వర్కౌట్ అవలేదు. మరి ఈ హిట్ బ్యూటీస్ అంతా తెలుగులో బిజీ అవుతారా లేదా అనేది చూడాలి.




