AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: జోరు తగ్గించిన రష్మిక మందన్న.. కొత్త ప్లాన్ ఏదైనా ఉందంటారా ??

ఒక్క ఫ్లాప్‌తోనే రష్మిక మందన్న జోరుకు బ్రేకులు పడిపోయాయా..? బాలీవుడ్ సంగతి పక్కనబెడితే.. మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఎందుకు రష్మిక జోరు చూపించట్లేదు..? ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు మినహాయిస్తే.. ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్ ఎందుకు సైన్ చేయట్లేదు..? అసలు రష్మిక మందన్న ప్లాన్ ఏంటి..? సినిమాలకు కావాలనే బ్రేక్ ఇస్తున్నారా..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: May 17, 2025 | 4:12 PM

Share
యానిమల్, పుష్ప 2, ఛావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్.. ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరస విజయాలు అందుకున్నారు రష్మిక మందన్న. ఈ మూడు సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు.

1 / 5
ఈమె అడుగు పెట్టిన సినిమా బ్లాక్‌బస్టర్ అని ఫిక్సైపోయారు మేకర్స్ కూడా. ఇలాంటి సమయంలో విడుదలైన సికిందర్ అంచనాలన్నీ తారుమారు చేసింది. సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమా మొదటి రోజు నుంచే డల్‌గా మొదలైంది.

2 / 5
ఓపెనింగ్స్ కూడా ఏమంత గొప్పగా రాలేదు.. ఫైనల్ రన్ కూడా అతికష్టం మీద 100 కోట్లు నెట్ దాటింది. ఇక రష్మిక పాత్ర విషయానికి వస్తే.. అరగంటకు అటూ ఇటూగా ఉండే పాత్రతో సరిపెట్టేసారు మురుగదాస్. లేదనకుండా 2 పాటల్లో కనిపించారు ఈ బ్యూటీ.

3 / 5
సికిందర్‌లో రష్మిక మందన్న పాత్ర అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదనేది ఆమె ఫ్యాన్స్ చెప్తున్న మాట. రష్మిక లక్‌తో అయినా భాయ్‌కు హిట్ వస్తుందేమో అనుకుంటే.. భాయ్ బ్యాడ్ లక్ వచ్చి రష్మికకు అంటుకుంది. దాంతో ఈ బ్యూటీకి చాలా కాలం తర్వాత ఫ్లాప్ తప్పలేదు. ఈ ఎఫెక్ట్ ఆమె కెరీర్‌పై కనిపిస్తుందిప్పుడు. పైగా కావాలనే కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంటున్నారు ఈ బ్యూటీ.

4 / 5
సికిందర్ తర్వాత రష్మిక జోరుకు కాస్త బ్రేకులు అయితే పడ్డాయి. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో తమా సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇది మినహా మరే సినిమాకు సైన్ చేయలేదు ఈ బ్యూటీ. అలాగే తెలుగులో ఎప్పుడో ఓకే చేసిన గాళ్‌ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలతోనే సరిపెట్టుకున్నారు. ఈమె తీరు చూస్తుంటే కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

5 / 5