- Telugu News Photo Gallery Cinema photos Will Ram Pothineni get the hit with his upcoming movie andhra king thaluka
Ram Pothineni: రామ్ కెరీర్ కు కీలకంగా ఆంధ్ర కింగ్ తాలూకా.. ఈ మూవీ తో అయిన కోరిక నెరవేరుతుందా
వెండితెర మీద సక్సెస్ అవ్వాలంటే అందం అభినయం మాత్రమే సరిపోదు. ఇంకాస్త అదృష్టం కూడా ఉండాలి. ఎంత మంచి నటుడైనా... ఎంత గొప్ప బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా... సక్సెస్‌ఫుల్ స్టార్ అనిపించుకోవాలంటే కాలం కలిసిరావాలి. ఇప్పుడు అలాంటి టైమ్ కోసమే ఎదురుచూస్తున్నారు రామ్. మరి అప్ కమింగ్ మూవీతో ఈ హీరో కోరిక నెరవేరుతుందా?
Updated on: May 17, 2025 | 3:40 PM

స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్, ఇంట్రస్టింగ్ మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెడీ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో స్టార్ లీగ్‌లో సత్తా చాటారు.

అయితే హీరోగా మంచి మార్కులు సాధించినా.. వరుస విజయాలు సాధించటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఈ ఎనర్జిటిక్ స్టార్. 2019లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోయింది.

రెడ్ సినిమా పర్వాలేనిపించినా... ఆ తరువాత వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అందుకే నెక్ట్స్ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు రామ్ పోతినేని.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్రాకింగ్ తాలూకా. ఓ అభిమాని బయోపిక్ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆంధ్రా కింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన అభిమానిగా రామ్ నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.

ప్రజెంట్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు రామ్. వరుస ఫెయిల్యూర్స్‌తో కెరీర్ కష్టాల్లో ఉన్న టైమ్‌లో ఆంధ్రాకింగ్ తాలూకాతో కెరీర్ గాడిలో పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తనకు బాగా కలిసొచ్చిన కామెడీ, రొమాన్స్‌తో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. మరి రామ్ ఆశలను ఆంధ్రాకింగ్ తాలుకా నిజం చేస్తుందేమో చూడాలి.




