AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhunush: ఆ అవమానం తట్టుకోలేక గదిలో కూర్చుని ఏడ్చేవాడట.. కట్ చేస్తే నేడు పాన్ ఇండియా సూపర్ స్టా్ర్..

ఇటీవలే సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ధనుష్. హీరోగానే కాకుండా.. గాయకుడిగానూ మెప్పించాడు. తను నటించిన చాలా సినిమాలకు పాటలు రాయడంతోపాటు.. అద్భుతంగా పాడి మెప్పించాడు.

Dhunush: ఆ అవమానం తట్టుకోలేక గదిలో కూర్చుని ఏడ్చేవాడట.. కట్ చేస్తే నేడు పాన్ ఇండియా సూపర్ స్టా్ర్..
Dhanush
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2023 | 1:30 PM

Share

గమ్యం చేరే దారిలో ఎన్నో అడ్డంకులు.. మరెన్నో అవమానాలు… అన్నింటిని ఎదురించి మనోధైర్యంతో ముందడుగు వేసినవారి గురించి వింటుంటాం. ఇప్పుడు తమకంటూ గుర్తింపు తెచ్చుకుని.. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన వారంతా ఒకప్పుడు అనేక అవమానాలకు గురైనవారే. ముఖ్యంగా సినీ పరిశ్రమలో బాడీ షేమింగ్స్.. ట్రోలింగ్స్.. అవమానాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం వెండితెరపై స్టార్ డమ్ సంపాదించిన పలువురు హీరోస్ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నవారే. అందులో తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజీ హీరోగా స్టార్ డమ్ సంపాదించుకున్నారు ధనుష్. దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ ఈహీరో ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇటీవలే సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ధనుష్. హీరోగానే కాకుండా.. గాయకుడిగానూ మెప్పించాడు. తను నటించిన చాలా సినిమాలకు పాటలు రాయడంతోపాటు.. అద్భుతంగా పాడి మెప్పించాడు. అయితే హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన తొలినాళ్లలో ధనుష్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ముఖ్యం తన సినిమా సెట్స్ లోని యాక్టర్స్, స్టాఫ్ నుంచి బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

2003లో కాదల్ కొండేన్ సినిమా సెట్స్ లో తన లుక్స్ చూసి ఎగతాళి చేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే ఆ ట్రోల్స్ తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని..దీంతో గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలున్నాయని పేర్కొ్న్నాడు. ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం ఇష్టం లేకనే.. ఓసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో ఎవరని తనను అడిగితే మరొకరిని చూపించానని.. కానీ ఆ తర్వాత హీరో తనే అని తెలియడంతో సెట్స్ లో ఉన్నవారంతా తనను చూసి నవ్వుకున్నారని అన్నారు. హీరో ఆటో డ్రైవర్ లా ఉన్నాడని కామెంట్ చేశారని.. అప్పటికీ ఇంకా చాలా చిన్నవాడినని.. ఏం చేయాలో తెలియక కారు వద్దకు వెళ్లి గట్టిగా అరిచానని .. ఆ తర్వాత ఆటో డ్రైవర్ ఎందుకు హీరో కాకూడదని ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అయితే తొలి సినిమాతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నారు ధనుష్. ఆ తర్వాత తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఇవి కూడా చదవండి

ఇటీవలే తెలుగులో నేరుగా సార్ చిత్రంతో అరంగేట్రం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ జోడిహా సంయుక్త నటించింది. విద్యా వ్యవస్థలోని అవినీతి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ధనుష్.. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుంది.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే