Devi sri Prasad: స్టేజ్ పైనే డైరెక్టర్‌తో గొడవపడ్డ దేవీ శ్రీ ప్రసాద్.. అంతమాట అనేశాడేంటీ

సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. దేవీ అందించే సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమా పై హైప్ ను పెంచేశాయి. రీసెంట్‌గా పుష్ప ఈవెంట్ లో దేవీ శ్రీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Devi sri Prasad: స్టేజ్ పైనే డైరెక్టర్‌తో గొడవపడ్డ దేవీ శ్రీ ప్రసాద్.. అంతమాట అనేశాడేంటీ
Devi Sri Prasad
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2024 | 10:45 AM

దేవీ శ్రీ ప్రసాద్ పేరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వినిపిస్తుంది. పుష్ప సినిమాతో దేవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరిగిపోయింది. ఇక పుష్ప సినిమా సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవీ శ్రీ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. దేవీ అందించే సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమా పై హైప్ ను పెంచేశాయి. రీసెంట్‌గా పుష్ప ఈవెంట్ లో దేవీ శ్రీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 ఈవెంట్ లో టీవీ నిర్మాతల పై అసహనం వ్యక్తం చేశారు.

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

ఇదిలా ఉంటే గతంలో దేవీ శ్రీ ఓ దర్శకుడితో స్టేజ్ పైనే గొడవపడ్డాడు. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన లెజెండ్ సినిమాకు దేవి సంగీతం అందించాడు. బోయపాటి లెజెండ్ సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా దీవి మాట్లాడుతూ.. “నా ప్రతి సినిమాకు నా ఫస్ట్ సినిమాలనే కష్టపడతాను. ఫైనల్ మిక్స్ అయ్యేంతవరకు నేను థియేటర్ లోనే ఉంటాను. నేను రాను అంటే అది తప్పైపోతుంది. అలాగే బోయపాటి మాట్లాడుతూ.. 13 రోజులు నాతోనే ఉన్నారు అని అన్నారు. లేదు ఆయన నాతో లేరు. అంతా చేసేసిన తర్వాత లాస్ట్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు .. ఒక రెండు, మూడు రోజులు వచ్చారు” అని అన్నాడు.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

“బోయపాటిగారు వచ్చి నా డిస్కషన్ రూమ్ లో కూర్చొని ఇంగ్లిష్ సినిమాలు చూసుకున్నారు లాప్ టాప్ లో. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే.. నాతో పాటు చాలా మంది పని చేశారు. వాళ్ళ క్రెడిట్ వాళ్లకు ఇవ్వాలి. నాకు రీ రికార్డ్ అంటే ప్రాణం. రీ రికార్డింగ్ నేనే చేశాను. 13 రోజులు నన్ను పాడుకోనివ్వకుండా అని అన్నారు.. నాకు ఎవ్వరూ చెకింగ్ అక్కర్లేదు. నేనే పడుకొను.. ఒక సినిమా నా దగ్గరకు వచ్చిందంటే.. మీరే వద్దు అన్న నేను నిద్రపోను”.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను నెటిజన్స్ మరోసారి వైరల్ చేస్తున్నారు.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..