Allu Arjun : అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టు రక్షణ.. అసలు ఏం జరిగిందంటే..
ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తుంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) రక్షణ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆయనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో.. అదే టెక్నాలజీ వ్యక్తిగత హక్కులకు ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలు పెద్ద సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు కీలక ఊరట లభించింది. ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆయన వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ తుషార్ రావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు స్పష్టం చేసిన అంశం ఏమిటంటే.. ఒక వ్యక్తి పేరు, రూపం, స్వరం, మాట్లాడే తీరు, హావభావాలు.. ఇవన్నీ అతనికి ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు. ఇవి చట్టపరంగా రక్షణ పొందాల్సిన హక్కులే. కృత్రిమ మేధస్సు దుర్వినియోగంపై కోర్టు కఠినంగా స్పందించింది. అల్లు అర్జున్ పేరుతో డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేయడం, అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలు రూపొందించడం, కాపీరైట్ ఉల్లంఘనలపై నిషేధం విధించింది.
Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..
ఈ కేసులో కోర్టు ఏకపక్ష మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ప్రతివాదుల వాదనలు వినకముందే, తక్షణ రక్షణ అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం వారికి నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పు కేవలం అల్లు అర్జున్‌కే కాకుండా.. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి వ్యక్తిత్వ హక్కులకు రక్షణగా నిలిచే అవకాశముంది. గతంలో చిరు, ఎన్టీఆర్ లకు కూడా ఢిల్లీ హైకోర్టు ఇలాంటి రక్షణే కల్పించింది.
Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాకా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇందులో దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తుంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా (AA23), అలాగే ప్రశాంత్ నీల్‌తో మరో భారీ చిత్రం చర్చల దశలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.
Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..
Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..
