AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్రపాడు మావ..! 9.2 రేటింగ్ దుమ్మురేపుతున్న థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లలో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది .

బుర్రపాడు మావ..! 9.2 రేటింగ్ దుమ్మురేపుతున్న థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2026 | 10:06 PM

Share

ఓటీటీలో ఆకట్టుకునే సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. ఓటీటీల సినిమాల పుణ్యమా అని ఎన్నో రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి మెప్పిస్తున్నాయి. తెలుగు సినిమాలే కాదు ఇతరభాషల సినిమాలు కూడా ఓటీటీలో డబ్ అయ్యి అందుబాటులో ఉన్నాయి. ఇక ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా చూడటానికి ఆడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఆ సినిమా మరో తెలుసా.. ఆ సినిమానే పీటర్. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమాకు సుకేష్ శెట్టి దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో రాజేష్ ధ్రువ (పీటర్ పాత్రలో), జాన్వీ రాయల, రవీక్ష శెట్టి నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ కర్ణాటకలోని కూర్గ్ (కొడగు) ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది.

ఈ సినిమాలో పీటర్ ఒక ‘చెండే’ (సాంప్రదాయ వాయిద్యం) వాయించే డ్రమ్మర్. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన సొంత ఊరికి చాలా కాలం పాటు దూరంగా ఉంటాడు. చాన్నాళ్ల తర్వాత అతను మళ్లీ తన ఊరికి తిరిగి వస్తాడు. మొదట్లో అంతా ప్రశాంతంగానే అనిపించినా, అతను ఊర్లోకి అడుగుపెట్టాక గతంలోని కొన్ని చేదు జ్ఞాపకాలు, సంఘటనలు అతన్ని వెంటాడటం మొదలుపెడతాయి. గతంలో ఆ ఊరి దేవాలయ ఉత్సవాల సమయంలో జరిగిన ఒక వివాదం, పీటర్ జీవితాన్ని పూర్తిగా మార్చేసి ఉంటుంది. ఊరి ప్రజలు దాచిపెట్టిన కొన్ని రహస్యాలు, ఒక మిస్టరీ సంఘటన చుట్టూ కథ మలుపు తిరుగుతుంది. పీటర్ ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో ఊరిలోని కొందరు నమ్మిన వాళ్లే అతనికి వెన్నుపోటు పొడిచారనే నిజం తెలుస్తుంది.  ఆతర్వాత ఏం జరిగింది.? పీటర్ ఎలా పగ తీర్చుకున్నాడు.? అనేది సినిమాలో చూడాలి. ఈ రివెంజ్ డ్రామా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. ఐఎమ్‌డీ‌బి‌లో ఈ సినిమా 9.2 రేటింగ్ తో దుమ్మురేపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?