Srikanth Odela:పెళ్లిపీటలెక్కిన ‘దసరా’ డైరెక్టర్.. గ్రాండ్‌గా శ్రీకాంత్ ఓదెల వివాహం.. వధువు ఎవరంటే?
శ్రీకాంత్ ఓదెల.. ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడీ యంగ్ డైరెక్టర్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా అతను తెరకెక్కించిన దసరా సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుకుమార్ శిష్యుడిగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ కెరీర్ ఆరంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

శ్రీకాంత్ ఓదెల.. ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడీ యంగ్ డైరెక్టర్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా అతను తెరకెక్కించిన దసరా సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుకుమార్ శిష్యుడిగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ కెరీర్ ఆరంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రెండో సినిమా ప్రయత్నాల్లో ఉన్న ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెబుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. గోదావరి ఖనిలో శ్రీకాంత్ ఓదెల వివాహం వేడుకగా జరిగింది. దర్శకుడు సుకుమార్, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌తో సహా పలువురు సినిమా సెలబ్రిటీలు శ్రీకాంత్ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అయితే హీరో నాని మాత్రం ఈ పెళ్లి వేడుకకు హాజరుకాలేకపోయాడు. ప్రస్తుతం అతను ఓ సినిమా షూటింగ్ కోసం పుణెలో ఉన్నాడు. అయితే శ్రీకాంత్ ఓదెల పెళ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో ముందుగా రివీల్ చేసింది మాత్రం మన నానినే.
శ్రీకాంత్ ఓదెల దంపతుల ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన నాని ‘ మన శ్రీకాంత్ ఓదెల పెళ్లి చేసుకున్నాడు. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు అతని అందజేయండి’ అని నూతన వధూవరులకు విషెస్ చెప్పాడుఇందులో కొత్త జంట చిరునవ్వులు చిందిస్తూ చూడముచ్చటగా ఉంది. . ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా దసరా సూపర్ హిట్ తర్వాత తన తర్వాతి ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు శ్రీకాంత్. అయితే ఓ స్టార్ హీరోతో అతను సినిమా తీస్తున్నాడని, ఓ బడా నిర్మాణ సంస్థ ఈ మూవీని తెరకెక్కిస్తుందని తెలుస్తోంది.




Mana @odela_srikanth pelli chesukunnadu 🙂 Send all your love and blessings ♥️ pic.twitter.com/ZixLIXdkid
— Nani (@NameisNani) May 31, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.