Prabhas: ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ పాత్రపై క్లారిటీ.. గ్లామర్ బ్యూటీ యాక్షన్ షూటింగ్..

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అంతేకాదు.. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక కొద్ది రోజులుగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Prabhas: 'ప్రాజెక్ట్ కె'లో దిశా పటానీ పాత్రపై క్లారిటీ.. గ్లామర్ బ్యూటీ యాక్షన్ షూటింగ్..
Project K
Follow us

|

Updated on: May 31, 2023 | 4:41 PM

దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ప్రభాస్ సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ఓ క్రేజ్ ఏర్పర్చుకున్న డార్లింగ్.. ఇప్పటివరకు మరో హిట్టు అందుకోలేకపోయారు. ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో.. డార్లింగ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కె పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారట. ప్రాజెక్ట్ కె చిత్రంలో ప్రభాస్ ను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించనున్నారట. ఇదే విషయంపై ఇప్పటికే ఆయనను చిత్రయూనిట్ సంప్రదించగా ఓకే చేశారని.. ఇందుకోసం కమల్ కు రూ. 150 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు మరో క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఇందులో దీపికా కాకుండా.. మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్లామర్ బ్యూటీ పై ఓ సాలిడ్ యాక్షన్ షూటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దిశా పటానీ పై జరిగిన షూటింగ్ ప్రాజెక్ట్ కె కోసం కాదని ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో దిశా పటానీ మాత్రం మాస్ యాక్షన్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.