Urfi Javed: మితిమీరిన అందాల ఆరబోత.. చిక్కులో బిగ్ బాస్ చిన్నది
ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి ఉర్ఫీ జాదవ్ కూడా వెరైటీ అంటూ పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఆమె చిత్రవిచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది

బాలీవుడ్ లో చాలా మంది తారలు విచిత్రమైన డ్రసింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్స్ అయితే రకరకాల దుస్తుల్లో దర్శనమిస్తుంటారు. కొంతమంది అయితే మితిమీరి వెరైటీ పేరుతో ఇష్టమొచ్చిన దుస్తులను ఇంకా విచిత్రంగా డిజైన్ చేయించుకొనిధరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి ఉర్ఫీ జాదవ్ కూడా వెరైటీ అంటూ పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఆమె చిత్రవిచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది .. తాను చేసే ఫోటోషూట్స్, డ్రెస్సింగ్ స్టైల్స్ వల్లే ఉర్ఫీ ఎక్కువగా ఫేమస్ అయ్యింది. డ్రెస్సింగ్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటుంది. అలాగే అందాల ఆరబోతకు కూడా ఈ అమ్మడు తగ్గదు.
దీంతో ఆమెపై ఎక్కువగా ట్రోలింగ్స్ జరుగుతుంటాయి. కొందరు ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ సెన్స్ కు మద్దతు తెలపగా.. మరికొందరు మాత్రం పిచ్చి అంటూ ట్రోలింగ్ చేస్తుంటారు. అయితే ఉర్ఫీ జావేద్.. తన పై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోదు.. అంతేకాకుండా.. తనపై నెగిటివ్ కామెంట్స్ చేసినవారికి తనదైన స్టైల్లో ఆన్సర్ ఇస్తుంది. తాజాగా ఈ అమ్మడి పై పోలీసులకు ఫిర్యాదు అందింది.




తాజాగా ఉర్ఫీ జావెద్ ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాటలో మరింత రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. అలాగే ఎప్పటిలానే చిత్ర విచిత్రమైన డ్రసింగ్ తో దర్శనమిచ్చింది. ఇక పాటలో బూతులు కూడా ఉన్నాయి. దాంతో ఈ విషయంపై ఉర్ఫీ జావెద్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మరి ఈ విషయం పై ఉర్ఫీ జావెద్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




