AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudhakar: హ్యాపీగా, హెల్దీగా ఉన్నా.. అలాంటి వార్తలను నమ్మొద్దు.. వీడియో రిలీజ్‌ చేసిన కమెడియన్‌ సుధాకర్‌

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ చనిపోయారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కల్పిత వార్తలు తెగ వైరలైన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా వెబ్‌సైట్లు కూడా సుధాకర్‌ కన్నుమూశారంటూ కథనాలు పబ్లిష్‌ చేశాయి. ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన సుధాకర్‌ తనపై వస్తోన్న అసత్య వార్తలను ఖండించారు.

Sudhakar: హ్యాపీగా, హెల్దీగా ఉన్నా.. అలాంటి వార్తలను నమ్మొద్దు.. వీడియో రిలీజ్‌ చేసిన కమెడియన్‌ సుధాకర్‌
Comedian Sudhakar
Basha Shek
|

Updated on: May 25, 2023 | 11:22 AM

Share

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ చనిపోయారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కల్పిత వార్తలు తెగ వైరలైన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా వెబ్‌సైట్లు కూడా సుధాకర్‌ కన్నుమూశారంటూ కథనాలు పబ్లిష్‌ చేశాయి. ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన సుధాకర్‌ తనపై వస్తోన్న అసత్య వార్తలను ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. దయచేసి తప్పుడు వార్తలపు ప్రసారం చేయద్దని విజ్ఞప్తి చేశారు. ‘అందరికీ నమస్కారం. నా మీద వచ్చినవన్నీ అసత్య వార్తలే. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాంటివి స్ప్రెడ్ చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ వెరీ హ్యాపీ’ అని వీడియోలో చెప్పుకొచ్చారు సుధాకర్‌. తద్వారా ఆయన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులకు చెక్‌ పెట్టేశారు. కాగా సుధాకర్‌పై ఇలాంటి కథననాలు రావడంపై సినీ అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుధాకర్ ఆరోగ్యం గురించి ఇలాంటి ఫేక్‌ రూమర్స్ రావడం ఇదేమీ మొదటి సారి కాదు. 2010లో ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లారు. ఆ సమయంలోనే సుధాకర్ మరణించారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్‌ అయ్యాయి. అయితే వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఆయన తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం కూడా సుధాకర్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.

ఇటీవల దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావుపై కూడా ఇలాంటి డెత్‌ రూమర్లు తెగ వైరలయ్యాయి. స్వయానా ఆయనే వీడియో రిలీజ్‌ చేసి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇటీవల చనిపోయిన శరత్ బాబుపై కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. ఆయన చనిపోకముందే కన్నుమూశారంటూ నెట్టింట వార్తలు తెగ వైరలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!