AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్‌కు నన్ను తీసుకొచ్చింది ఆయనే.. అతనివల్లే ఇప్పుడు ఇలా ఉన్నా : నరేష్

ప్రముఖ టీవీ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ కామెడీ ప్రోగ్రాం.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది నటీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

జబర్దస్త్‌కు నన్ను తీసుకొచ్చింది ఆయనే.. అతనివల్లే ఇప్పుడు ఇలా ఉన్నా : నరేష్
Naresh
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2026 | 12:18 PM

Share

జబర్దస్త్ కమెడియన్ నరేష్.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా నవ్వులు పూయించాడు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను, ఆర్థిక కష్టాల నుండి విజయం సాధించిన తీరును పంచుకున్నాడు. తన తండ్రి ట్రాలీ డ్రైవర్‌గా పనిచేసిన కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన నరేష్, ఆర్థిక సమస్యల కారణంగా తొమ్మిదో తరగతిలోనే చదువును ఆపేయాల్సి వచ్చిందని తెలిపాడు. తన సొంత నిర్ణయంతోనే జబర్దస్త్ ఆడిషన్స్‌కు వెళ్లినట్లు పేర్కొన్నాడు. జబర్దస్త్ తన మొదటి షో అని నరేష్ తెలిపాడు. ఆడిషన్స్‌లో సుధాకర్ తనను గుర్తించి జబర్దస్త్‌కు ఆహ్వానించారని, మొదట చలాకీ చంటి స్కిట్‌లో, ఆ తర్వాత తిరుపతి ప్రకాష్ టీమ్‌లో ఐదు, ఆరు స్కిట్లు చేసినట్లు గుర్తుచేసుకున్నాడు.

30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

సుధాకర్, భాస్కర్ టీమ్ లీడర్‌గా మారడంతో తన కెరీర్ మలుపు తిరిగింది. రెండు తలకాయలు స్కిట్ తనకు రాత్రికి రాత్రి గుర్తింపు తెచ్చిపెట్టిందని, ఆ తర్వాత తన కష్టాలు తీరిపోయాయని, ఏడాదిలోపే తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చేశానని ఆనందంగా తెలిపాడు. జబర్దస్త్ షో ఆడియన్స్‌ను కుటుంబ సభ్యుల్లా భావిస్తుందని, తనను ఎవరైనా అలానే చూస్తారని తెలిపాడు. జబర్దస్త్‌లో తనకు భాస్కర్ టీమ్ బాగా సౌకర్యంగా ఉంటుందని నరేష్ చెప్పాడు. ఇమ్మాన్యుయేల్, నూకరాజు, ప్రవీణ్ వంటి వారితో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, స్క్రిప్ట్‌తో పాటు స్పాంటేనియస్ పంచ్‌లకు కూడా ప్రాధాన్యత ఇస్తానని అన్నాడు. జబర్దస్త్‌లో టీమ్‌ల మధ్య పోటీ కంటే సహకారమే ఉంటుందని, ఒకరి అవసరం ఉంటే మరొకరు వచ్చి చేస్తారని తెలిపాడు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా మల్లెమాల కంపెనీ ద్వారా లేదా సీనియర్ టీమ్ లీడర్ల ద్వారా మంచి పారితోషికం వస్తుందని, ప్రస్తుతం జబర్దస్త్ ఆర్టిస్టులకు ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేశాడు. ఇతర జూనియర్లు కూడా తమ ప్రతిభను నిరూపించుకొని గుర్తింపు పొందుతున్నారని చెప్పాడు.

16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి

నరేష్‌ను టీచర్లు, స్నేహితులు ప్రత్యేకంగా చూసేవారని, డాన్స్‌లో తనకు ఆసక్తి ఉండేదని తెలిపాడు. తన ఎత్తు గురించి మాట్లాడుతూ, అది గ్రోత్ హార్మోన్స్ సమస్య వల్ల వచ్చిందని, అయితే జబర్దస్త్ కెరీర్‌లో అది తనకు ప్లస్ అయ్యిందని అన్నాడు. చిన్నతనంలో ఉద్యోగాలు దొరక్క ఆర్థికంగా బాధపడిన రోజులను కూడా గుర్తుచేసుకున్నాడు. తన తల్లిదండ్రులు మళ్ళీ కష్టపడకుండా చూసుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. సినీ ప్రముఖులతో తన అనుభవాలను పంచుకుంటూ, రవితేజ, చిరంజీవి, వెంకటేష్, సమంతలను కలిశానని తెలిపాడు. చిరంజీవి సినిమాలో చిన్న పాత్రలో నటించినట్లు, వెంకటేష్ తమ స్కిట్లను అనుకరించారని తెలిపాడు. పవన్ కల్యాణ్ సినిమా అవకాశం ఒకసారి మిస్సయిందని కూడా వెల్లడించాడు. ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు నితిన్ గారి సినిమాకు కూడా కమిట్ అయినట్లు తెలిపాడు. తనకు ప్రస్తుతం లవ్ ఏమీ లేదని నరేష్ స్పష్టం చేశాడు. రోజా, నాగబాబుల తీర్పులు సరైనవని, వారిద్దరూ న్యాయనిర్ణేతలుగా ఉన్నప్పుడు జబర్దస్త్ మరో స్థాయిలో ఉండేదని చెప్పుకొచ్చాడు నరేష్.

ఇవి కూడా చదవండి

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us