AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. సినిమాల్లో రాణించాలని ఎంతో మంది ఎన్నో ఆశలతో అడుగుపెడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇక చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కూడా వారిలో ఒకరు.

16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2026 | 5:03 PM

Share

తెలుగు చిత్రసీమలో ‘బామ్మ’ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి ఆమె. 16ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆమె.దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. దాదాపు తెలుగులో ఉన్న హీరోలందరి సినిమాల్లో నటించారు ఆమె.. హీరోయిన్ గా సినిమాలు చేసిన ఆమె ఎక్కువగా తల్లి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. అలాగే బామ్మ పాత్రలకు చాలా ఫెమస్ ఆమె.. ఆ సీనియర్ నటి ఎవరో కాదు నిర్మలమ్మ. ఆమె అసలు పేరు రాజమణి. 1920 జూలై 18న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో గంగయ్య, కోటమ్మ దంపతులకు ఆమె జన్మించారు. తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నిర్మలమ్మ, వందలాది తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక పాత్రలలో జీవించారు. ఒకప్పుడు నిర్మలమ్మ లేని సినిమా లేదనేంతగా ఆమె పాపులారిటీ సంపాదించుకున్నారు.

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుల నుండి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులు అందుకుని, ఏకంగా 1000కి పైగా సినిమాల్లో నటించి, తిరుగులేని నటిగా కీర్తి ప్రతిష్టలు గడించారు. చిన్ననాటి నుంచే నాటకాలంటే నిర్మలమ్మకు ప్రాణం. ఇదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1943లో తన 16వ ఏట గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తర్వాత 1961లో కృష్ణ ప్రేమ చిత్రంలో రుక్మిణి పాత్ర లభించింది. భార్యాభర్తలు చిత్రంలో అక్కినేనికి తల్లిదండ్రులుగా గుమ్మడితో కలిసి నటించి హిట్ కాంబినేషన్‌గా దాదాపు 20 సినిమాల్లో జంటగా నటించారు. మనుషులు మారాలి అనే చిత్రం నిర్మలమ్మకు నటిగా విశేష పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఈ సినిమా శతదినోత్సవానికి వచ్చిన హిందీ నటుడు ప్రాణ్, “నువ్వు శోభన్ బాబుకే అమ్మ కాదు, భారత్ కే మా” అని ప్రశంసించారు. ఆ తర్వాత కాలంలో ఆమెకు తల్లి, పిన్ని పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి.

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో

అమ్మగా, వదినగా, బామ్మగా ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్లలో నిర్మలమ్మ తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా తన పాత్రలతో చెదిరిపోని ముద్ర వేశారు. తెలుగులోనే కాదు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆమె భారతదేశంలోనే గొప్ప నటీమణిగా పేరు సంపాదించుకున్నారు. చనిపోయేవరకు కూడా సినిమాల్లో నటించారు. కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగానూ నిర్మలమ్మ పనిచేశారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం వంటి సినిమాను నిర్మించారు. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, నిర్మలమ్మ సినిమాలు చేస్తున్నప్పుడే తన 19వ ఏట ప్రొడక్షన్ మేనేజర్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వారికి సంతానం కలగలేదు. దీంతో కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు. కవితకు పెళ్లి చేసిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. అతడి పేరు విజయ్ మాదల. నిర్మలమ్మ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ మాదల, జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమాలో నటించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది. అయితే, విజయ్ మాదల పుట్టి పెరిగిందంతా అమెరికాలో కావడం వల్ల, తెలుగు ఉచ్చారణ సరిగా రాక తెలుగులో ఆయనకు అవకాశాలు తగ్గాయి. 2009 ఫిబ్రవరి 19న కన్నుమూసిన నిర్మలమ్మను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు.

ఇవి కూడా చదవండి

50 దేశాల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా.. తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us