Video: కోహ్లీ vs గంభీర్ గొడవకు అసలు కారణం ఇదే.. 13 ఏళ్ల తర్వాత బయటపెట్టిన అంపైర్..!
Umpire Anil Chaudhary Virat Kohli Gautam Gambhir IPL 2013 clash: మైదానంలో ఎంతటి తీవ్రమైన ఆవేశం ఉన్నా మ్యాచ్ ముగిశాక క్రీడాస్ఫూర్తిని చాటడమే క్రీడాకారుల నిజమైన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. గతం పక్కనబెట్టి కోహ్లీ, గంభీర్ ప్రస్తుతం భారత జట్టు విజయాల కోసం కలిసి సాగుతుండటం శుభపరిణామం.

Umpire Anil Chaudhary Virat Kohli Gautam Gambhir IPL 2013 clash: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదంగా నిలిచిన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ గ్రౌండ్ మైండ్ వార్ ఇప్పటికీ క్రికెట్ ప్రేమికులకు గుర్తుంది. 2013 నాటి ఆ ఐకానిక్ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించిన అనిల్ చౌదరి నాటి మైదానపు తీవ్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు అసలు ఏం జరిగిందనే ఆసక్తికర నిజాలు ఇప్పుడు చూద్దాం.
క్రికెట్ మైదానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య నడిచిన పోరు గురించి తెలియని క్రీడాభిమాని ఉండరు. ఐపీఎల్ 2013 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరు ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద వివాదానికి తెరలేపింది. ఆర్సిబి ఛేజింగ్ సమయంలో కోహ్లీ ఔటై వెనుతిరుగుతుండగా గంభీర్ చేసిన అగ్రెసివ్ సంబరాలు, నోరు జారడం పెద్ద రచ్చకు దారితీశాయి. కోహ్లీ కోపంగా వెనక్కి తిరిగి గంభీర్ వైపు దూసుకెళ్లడంతో తోటి ఆటగాడు రజత్ భాటియా జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయాల్సి వచ్చింది.
అంపైర్ అనిల్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా జియో స్టార్ షోలో పాల్గొన్న మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి ఆ మ్యాచ్ అనుభవాలను పంచుకున్నారు. ఉత్తరాదికి చెందిన ఆటగాళ్లలో పుట్టుకతోనే ఆవేశం, దూకుడు ఎక్కువ ఉంటాయని, మ్యాచ్‌కు ముందే ఇలాంటి గొడవ ఏదో ఒకటి జరుగుతుందని తాను ఊహించినట్లు తెలిపారు. దూకుడుగా ఆడితేనే వారి అసలు నైపుణ్యం బయటకు వస్తుందని, ఆటగాళ్లను ఎక్కువగా నియంత్రిస్తే క్రికెట్‌లో అసలు మజా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎంతటి ఆవేశం ఉన్నా ఒక హద్దు ఉండాలని, దానిని దాటకూడదని ఆయన స్పష్టం చేశారు.
కోహ్లీ మనసులో కుట్రలు ఉండవు..
విరాట్ కోహ్లీ ప్రవర్తన గురించి మాట్లాడుతుండగా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ చిన్ననాటి రోజుల నుంచి తాను అంపైరింగ్ చేశానని, అతని మనసులో ఎలాంటి దుర్బుద్ది, పగ ఉండవని చెప్పారు. మైదానంలో అప్పుడప్పుడు ఆవేశంగా స్పందించినప్పటికీ, తన వైపు తప్పు ఉంటే వెంటనే వెనక్కి తగ్గి థంబ్స్ అప్ చూపిస్తాడని వెల్లడించారు. ఓవర్ల మధ్యలో వచ్చి సరదాగా అంపైర్ల నడుము చుట్టూ చేయి వేసి మాట్లాడే తత్వం కోహ్లీదని, ఇలాంటి ఎనర్జిటిక్ ఆటగాళ్లు లేకపోతే మ్యాచ్‌లు బోర్ కొడతాయని వ్యాఖ్యానించారు.
ఇదికూడా చదవండి: Video: ఇలాంటి ఔట్ చూశారా.. బద్దకంతో వికెట్ పారేసుకున్న టీమిండియా ప్లేయర్.. ఎవరంటే?
పదేళ్ల తర్వాత మళ్లీ అదే రచ్చ..
ఈ ఘటన జరిగిన పదేళ్లకు ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ముగిశాక కోహ్లీ, గంభీర్ మళ్లీ ముఖాముఖి తలపడిన సంగతి తెలిసిందే. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్‌తో మొదలైన మాటల యుద్ధం ఆ జట్టు మెంటార్‌గా ఉన్న గంభీర్‌తో పెద్ద గొడవగా మారింది. అప్పట్లో కేఎల్ రాహుల్ ఇద్దరినీ శాంతింపజేశాడు. అయితే గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరి మధ్య బంధం మళ్లీ బలపడి, ప్రస్తుతం స్నేహపూర్వకంగా పనిచేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




