AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangareddy: కాలం మారినా స్నేహం మారలేదు.. 37 ఏళ్ల తర్వాత ఐటీఐ మిత్రుల ఆత్మీయ కలయిక

మూడు దశాబ్దాలకు పైగా గడిచినా స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ 1987–89 ఫిట్టర్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తర్వాత ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హోదాలు, ఉద్యోగాలు, ఆర్థిక స్థాయిలను పక్కనబెట్టి ఆత్మీయంగా కలుసుకున్న ఈ సమ్మేళనం స్నేహానికి కాలంతో సంబంధం లేదని మరోసారి నిరూపించింది.

Sangareddy: కాలం మారినా స్నేహం మారలేదు.. 37 ఏళ్ల తర్వాత ఐటీఐ మిత్రుల ఆత్మీయ కలయిక
Old Friends Reunion
P Shivteja
| Edited By: |

Updated on: Aug 04, 2026 | 8:59 AM

Share

కాలం పరుగులో మూడు దశాబ్దాలకు పైగా గడిచిపోయినా… ఆ నాటి స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తాము చదివిన ఐటీఐ క్యాంపస్‌లోకి అడుగుపెట్టగానే… నాటి తరగతి గదులు, వర్క్‌షాప్‌లు, గురువులు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు ఒక్కసారిగా కళ్లముందు కదలాడాయి. ఆ జ్ఞాపకాలతో పలువురు భావోద్వేగానికి గురయ్యారు. సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో 1987–89 ఫిట్టర్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు.

ఈ కలయికలో హోదాలు, ఆర్థిక స్థాయిలు, ఉద్యోగాలు అన్నింటినీ పక్కనబెట్టి… ప్రస్తుతం ఎవరెవరు ఏ రంగాల్లో స్థిరపడ్డారు, జీవిత ప్రయాణం ఎలా సాగిందనే విషయాలను పరస్పరం పంచుకున్నారు. ఐటీఐ రోజుల్లో చేసిన అల్లరి, వర్క్‌షాప్ అనుభవాలు, గురువుల బోధనలు గుర్తు చేసుకుంటూ రోజంతా ఆనందోత్సాహాల మధ్య గడిపారు.

కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాలు, వ్యాపారాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ… స్నేహం కోసం ఒక్క పిలుపుతో అందరూ ఒకేచోట చేరడం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ ఆత్మీయ సమ్మేళనం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడమే కాకుండా… భవిష్యత్తులోనూ ఒకరికొకరు అండగా ఉంటామనే నమ్మకాన్ని మరింత బలపరిచిందని పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనం… స్నేహానికి కాలంతో పనిలేదని, హోదాలతో సంబంధం లేదని మరోసారి చాటిచెప్పింది. 37 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మధుర కలయిక అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది.

Follow Us
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
అంతపెద్ద భారీ దేహంతో ఇటెందుకొచ్చావ్ నాగన్నా..? భయంతో జనాలు గజగజ
అంతపెద్ద భారీ దేహంతో ఇటెందుకొచ్చావ్ నాగన్నా..? భయంతో జనాలు గజగజ
డాడీ సినిమాకు 25 ఏళ్లు.. పవన్, అల్లు అర్జున్ ఇద్దరికి స్పెషల్..
డాడీ సినిమాకు 25 ఏళ్లు.. పవన్, అల్లు అర్జున్ ఇద్దరికి స్పెషల్..
జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ
జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ
పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా
పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా
ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!
ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!
దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!
దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలల్లో కోళ్లు మృత్యువాత..
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలల్లో కోళ్లు మృత్యువాత..
జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి