AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

దక్షిణాది సినీప్రియుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య. చిన్న వయసులో నటిగా తెరంగేట్రం చేసి.. సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ ఆమె మరణం సినీపరిశ్రమకు తీరని లోటే. ఇప్పటికే సౌందర్యతో తమకున్న జ్ఞాపకాలను ఎంతో మంది నటీనటులు పంచుకున్నారు.

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..
Soundarya
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2026 | 11:55 AM

Share

హీరోయిన్ సౌందర్య.. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ ధ్రువతార. తిరుగులేని హీరోయిన్ గా ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్నారు సౌందర్య. సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్నారు సౌందర్య. అందం, అభినయం కలబోసిన సౌందర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తన దైన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఆమె సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. తెలుగులో ఆమె చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ముఖ్యంగా వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!

గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలోనే కనిపిస్తూ.. కేవలం నటనతోనే నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. సౌందర్య ఓ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది. కానీ అది మిస్ అయ్యిందట.. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? సౌందర్య ఎంతో మంది స్టార్ హీరోలతో నటించారు. ఆమె ఉన్న సమయంలోని అగ్రహీరోలందరి సరసన నటించారు. అయితే సౌందర్య పవన్ కళ్యాణ్ తో నటించాల్సిదట.. కానీ ఆ సినిమా మిస్ అయ్యిందట..

ఇవి కూడా చదవండి

అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో సుస్వాగతం చిత్రం ఒక డిఫరెంట్ సినిమాగా నిలిచింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ కు ప్రేమ కంటే తల్లిదండ్రులు, లక్ష్యం ముఖ్యం అని తెలియజేసే ఇతివృత్తంతో రూపొందింది. ఈ సినిమాలో గణేష్ పాత్ర సంధ్యను ఇష్టపడతాడు, కానీ చివరకు ప్రేమ కంటే జీవితం గొప్పదని గ్రహించి తన లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తాడు. మొదట సంధ్య పాత్రకు సౌందర్య అయితే బాగుంటుందని దర్శకుడు భావించారట. అయితే అప్పటికే సౌందర్య స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్నారు. పవన్ తన మూడో సినిమా చేస్తుండడంతో, పవన్ సూచన మేరకు సౌందర్య స్థానంలో అప్పుడప్పుడే తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకుంటున్న దేవయానిని ఎంపిక చేశారట. దేవయాని, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ కు ఓ బూస్టర్ లా పని చేసి, ఆయనకు తిరుగులేని స్టార్ డమ్ ను అందించింది. అలా పవన్, సౌందర్య కాంబినేషన్ మిస్ అయ్యిందట.

సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..