AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసి వైద్యులే షాక్..

గర్భం సాధారణంగా గర్భాశయంలో పెరుగుతుంది. కానీ బెంగళూరుకు చెందిన ఓ మహిళలో పిండం గర్భాశయం వెలుపల కిడ్నీల సమీపంలోని ఉదర భాగంలో పెరగడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత డెర్మాయిడ్ సిస్ట్‌గా భావించిన ఈ కేసు ఎంఆర్‌ఐలో అత్యంత అరుదైన ఎక్టోపిక్ గర్భధారణగా తేలింది. ఢిల్లీలోని వైద్యులు కీహోల్ (లాపరోస్కోపిక్) శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా చికిత్స అందించి మహిళను కాపాడారు.

గర్భధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసి వైద్యులే షాక్..
Rare Pregnancy (A representative image)
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2026 | 9:09 AM

Share

ఢిల్లీలోని వైద్యులు అత్యంత అరుదైన గర్భధారణకు విజయవంతంగా చికిత్స అందించారు. సాధారణంగా గర్భం గర్భాశయంలో పెరుగుతుంది. కానీ ఈ మహిళ విషయంలో పిండం గర్భాశయం వెలుపల, కిడ్నీల సమీపంలోని ఉదర భాగంలో పెరగడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యాధునిక కీహోల్ (లాపరోస్కోపిక్) శస్త్రచికిత్స ద్వారా ఈ క్లిష్టమైన కేసును విజయవంతంగా నిర్వహించారు.

బెంగళూరుకు చెందిన ఓ మహిళ సాధారణ గర్భధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. అల్ట్రాసౌండ్ పరీక్షలో 10 నుంచి 12 సెంటీమీటర్ల పరిమాణంలో సిస్ట్‌లాంటి నిర్మాణం కనిపించింది. అందులో పిండం భాగాలు కనిపించడంతో తొలుత వైద్యులు దాన్ని డెర్మాయిడ్ సిస్ట్‌గా భావించారు. అయితే అనంతరం నిర్వహించిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో అసలు విషయం బయటపడింది.

ఎంఆర్‌ఐలో గర్భాశయ గోడ చిట్లిపోయినట్లు గుర్తించారు. ఆ చీలిక కారణంగా గర్భం గర్భాశయం నుంచి బయటకు వచ్చి, కిడ్నీలకు సమీపంలోని రెట్రోపెరిటోనియల్ స్పేస్‌లో పెరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో శరీరంలోని ప్రధాన రక్తనాళాలు అయిన అయోర్టా, ఇన్‌ఫీరియర్ వెనా కావా ఉండటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.

వైద్యుల పరిశీలనలో సుమారు 12 వారాల వయస్సు ఉన్న, 7 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు గల పిండం ఆ సిస్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అత్యంత జాగ్రత్తగా లాపరోస్కోపిక్ (కీహోల్) శస్త్రచికిత్స నిర్వహించి పిండాన్ని తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ కేసుపై స్పందించిన ఎలాంటిస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ప్రసూతి-స్త్రీరోగ నిపుణుడు డాక్టర్ మన్నన్ గుప్తా మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసు అని తెలిపారు. సాధారణంగా ఎక్టోపిక్ గర్భధారణ ఫాలోపియన్ ట్యూబ్ లేదా అండాశయంలో ఏర్పడుతుందని, కానీ ఈ మహిళలో గర్భం గర్భాశయంలో కాకుండా కిడ్నీల సమీపంలోని ఉదర భాగంలో పెరగడం అత్యంత అరుదైన ఘటన అని చెప్పారు. ఈ తరహా కేసులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా నమోదవుతాయని ఆయన వివరించారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!